తెలంగాణ

telangana

ETV Bharat / politics

అమలుకు సాధ్యం కాని హామీలతో ప్రజలను కాంగ్రెస్‌ మభ్యపెడుతుంది : ఈటల రాజేందర్​ - Etela Rajender Comments on Congress

Etela Rajender Comments on Congress : రాష్ట్రంలో అమలుకు సాధ్యం కాని హామీలతో ప్రజలను కాంగ్రెస్‌ మభ్యపెడుతుందని బీజేపీ నేత ఈటల రాజేందర్‌ ఆరోపించారు. వరంగల్ జిల్లాలో కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఈటల, రాబోయే పార్లమెంట్​ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని బలపరచాలని కోరారు. బీజేపీకి ప్రజలంతా ఓటు వేసి దేశ పురోగమనంలో భాగం కావాలని విజ్ఞప్తి చేశారు.

Etela Rajender Comments on Congress
BJP Focus on Parliament Elections 2024

By ETV Bharat Telangana Team

Published : Feb 6, 2024, 7:07 PM IST

Etela Rajender Comments on Congress : రాష్ట్రంలో అమలుకు సాధ్యం కాని హామీలతో ప్రజలను కాంగ్రెస్‌ మభ్యపెడుతోందని బీజేపీ రాష్ట్ర ప్రచార కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్‌ ఆరోపించారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల పార్టీ కన్వీనర్లు అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలోఈటలపాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన ఆయన, దేశంలో సంకీర్ణ రాజకీయాలకు(Coalition Politics) తావు లేదని సుస్థిర ప్రభుత్వాలు మాత్రమే ఉండాలన్న నాయకుడు నరేంద్ర మోదీయేనని వ్యాఖ్యానించారు.

BJP Focus on Parliament Elections 2024 : రానున్న పార్లమెంటు ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సర్వం సిద్ధంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో మొత్తం 17 పార్లమెంటు స్థానాలకు ఐదు క్లస్టర్లుగా ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క క్లస్టర్​కు అనుభవం కలిగిన నాయకులను నియమించి పార్టీని బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ పార్లమెంట్​ స్థానాలు(Parliament Seats) ఒక క్లస్టర్​గా ఏర్పాటుచేసి దానికి మార్తినేని ధర్మారావును ఇన్​ఛార్జిగా నియమించడం జరిగిందని అన్నారు.

ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజల మద్దతు పొందాం : ఈటల రాజేందర్​

ఆదిలాబాద్ నుంచి మొదలుకొని అలంపూర్ వరకు, కొత్తగూడెం నుంచి మొదలుకొని పరికి తాండూర్ వరకు, ప్రాంతాలు, కులాలు అనే తేడా లేకుండా చివరికి పార్టీలను పక్కనపెట్టి ఈసారి కూడా నరేంద్ర మోదీని గెలిపించుకుంటామని ముందుకు వస్తున్నారని అన్నారు. ముఖ్యంగా ఆడపడుచులు ఈసారి ఎవరు చెప్పినా వినేది లేదని మోదీనే మరోసారి భారత దేశ ప్రధాని అని అంటున్నారని పేర్కొన్నారు.

"ఈ దేశానికి సంకీర్ణ రాజకీయాలే దిక్కు అని చర్చించుకుంటున్న తరుణంలో, ఈ దేశంలో సంకీర్ణ రాజకీయాలకు తావు లేదని, సుస్థిరమైన ప్రభుత్వాలు మాత్రమే ఉండాలని బలమైన ప్రభుత్వమే దిల్లీలో ఉండాలని దానికి తగ్గ నాయకుడు నరేంద్ర మోదీనే. ఆనాడు ప్రజలు పట్టం కట్టారు. ప్రతిపక్ష హోదాకు కూడా పనికి రానటువంటి పార్టీలు, అమలు కానటువంటి హామీలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలను మభ్యపెడుతున్నారు"-ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర ప్రచార కమిటీ ఛైర్మన్

సాధారణంగా ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా, ఎంపీగా చలామణి అవుతున్న వారిని వ్యతిరేకించడం ఆనవాయితీ, కానీ నరేంద్ర మోదీ(PM Modi) వచ్చిన తర్వాత కొత్త చరిత్రకు రూపకల్పన చేశారన్నారు. 2014లో గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన నాయకుడిగా, దేశంలో ప్రజల ముందుకు వచ్చి 273 స్థానాలను గెలుచుకొని, మిత్రపక్షాలను గెలిపించి ఐదు సంవత్సరాలు అజేయంగా ప్రధానమంత్రి పదవి చేపట్టిన ఘనత మోదీదేనని కొనియాడారు.

Etela Praised Modi Governance :పదేళ్ల కాలంలో ఎలాంటి అవినీతికి తావియ్యకుండా, మచ్చలేని నాయకుడిగా వెలుగొందాడని కీర్తించారు. 2014 నాటికి 11వ ఆర్థిక దేశంగా ఉన్న భారత్(India), మోదీ ప్రధానమంత్రి అయిన పదేళ్లలో ఐదో స్థానానికి చేరుకుందని వివరించారు. మూడోసారి ప్రధానమంత్రి అయితే భారతదేశం మూడో ఆభివృద్ది చెందిన దేశంగా ప్రపంచంలో స్థాయిలో నిలబడుతుందని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మారుతినేని ధర్మారావు, కొండేటి శ్రీధర్ ఏడు నియోజకవర్గాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అమలుకు సాధ్యం కాని హామీలతో ప్రజలను కాంగ్రెస్‌ మభ్యపెడుతుంది : ఈటల రాజేందర్​

రానున్న రోజుల్లో ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశం ఉంది : కిషన్​ రెడ్డి

తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధం - ఆ మూడు స్థానాలు సిట్టింగులకే

ABOUT THE AUTHOR

...view details