Errors in Final Voters List : ఓటర్ల తుది జాబితాలోనూ లెక్కకు మించిన తప్పులు. డెత్లు - డబుల్ ఎంట్రీలు. సమాచారం ఇచ్చినా తొలగించని అధికారులు. ఒక ఇంట్లో ఉండేది నలుగురే అయినా జాబితాలో 50 ఓట్లు ఉన్నాయి. ఇలా ఎన్నికల కమిషన్ ఇచ్చిన తుది ఓటర్ల జాబితాలోనూ తప్పుల తడకలు కనిపిస్తున్నాయి. రాజకీయ పార్టీల నాయకులు తప్పులు చూపించినా దిద్దుబాట్లు జరగలేదు. కొన్ని అభ్యంతరాలను పరిశీలించలేదు. వలస ఓట్లు. డబల్ ఎంట్రీ ఓట్లు కొనసాగించారు. ఇంత పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం ఉన్నా తుది జాబితాలోనూ తప్పులు ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ఓటర్ల జాబితా సవరణ దరఖాస్తుల్లో తప్పుడు సమాచారం ఇస్తే క్రిమినల్ కేసులు : ఈఆర్వో
ఎన్నికల కమిషన్ విడుదల చేసిన తుది ఓటర్ల జాబితా తప్పులమయంగా మారింది. 2023 అక్టోబర్ 27నుంచి డిసెంబర్ 9వరకు ప్రత్యేక ఓటర్ల నమోదు, సవరణ కార్యక్రమం జరిగింది. నెల్లూరు జిల్లాలో కొత్తగా ఓటు నమోదుకు 1.35లక్షల దరఖాస్తులు వచ్చాయి. మృతులు, దీర్ఘకాలికంగా వలస వెళ్లిన వారు ఇలా అనర్హుల తొలగింపునకు 2.01లక్షల దరఖాస్తులు వచ్చాయి. తప్పుల సవరణలు, చిరునామాల మార్పు వంటి వాటికి మరో 2.58లక్షలు వచ్చాయి. మొత్తంగా 6.95లక్షల దరఖాస్తులు అందాయి. ఇంత పెద్ద ఎత్తున వచ్చిన దరఖాస్తులను బూత్ స్థాయి అధికారులు, ఉప తహసీల్దార్లు క్షేత్ర స్థాయిలో పరిశీలించకపోవడంతో తుది జాబితాలోనూ దిద్దుబాట్లు జరగలేదు.
ఓటర్ల జాబితా విషయంలో ఏపీలోనే ఎందుకు ఇన్ని ఫిర్యాదులు ?
వరికుంటపాడులో 88, 89 పోలింగ్ కేంద్రాల పరిధిలో పెంచలమ్మ, శ్రీనివాసులు, లక్ష్మమ్మ, రమణమ్మ, వెంకటనారాయణ, రుక్మిణమ్మ ఇలా 20మంది వరకు మృతి చెందిన వారి పేర్లను తుది జాబితా నుంచి తొలగించలేదు. కావలికి చెందిన అనంతబొట్ల పద్మావతి కుటుంబంలో ఆరు ఓట్లు ఉన్నాయి. ఐదుగురి ఓట్లు స్థానికంగా 77వ నంబర్ పోలింగ్ బూత్ లో ఉన్నాయి. పద్మావతి ఓటు రెండు కిలోమీటర్ల దూరంలోని 83వ బూత్ లో ఓటు ఉంది. మార్చమని దరఖాస్తు చేసినా ఫలితం లేక పోయింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం వేదాయపాళెం సమీపంలోని ఇంటి నెంబర్ 26-03-287 లో నాలుగు ఓట్లకు మించి ఉండవు, అటువంటిది 50మందికిపైగా ఓటర్లు ఉన్నట్లు నమోదు చేశారు.
డూప్లికేట్, డబుల్ ఓటుపై ఈసీ కీలక ఆదేశాలు