ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

చివరిరోజు నాటకీయ పరిణామాల మధ్య నామినేషన్ల పర్వం - కూటమి అభ్యర్థులపై కుతంత్రాలు - Nomination end

Election Nomination Process Ends: వైఎస్సార్సీపీతో అంటకాగుతూ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీ, డీజీ స్థాయి అధికారులపై వేటు పడినా కొందరు పోలీసు అధికారుల తీరు మాత్రం మారలేదు. ఇంకా జగన్ భజనే చేస్తున్నారు. టీడీపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల పేర్లతో ఉన్న వారెవరైనా ఉంటే దగ్గరుండి నామినేషన్ వేసేందుకు తోడ్పాటు అందించారు.

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 26, 2024, 9:34 AM IST

Election Nomination Process Ends
Election Nomination Process Ends

చివరిరోజు నాటకీయ పరిణామాల మధ్య నామినేషన్ల పర్వం - కూటమి అభ్యర్థులపై కుతంత్రాలు

Election Nomination Process Ends :వైఎస్సార్సీపీతో అంటకాగుతూ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీ, డీజీ స్థాయి అధికారులపై వేటు పడినా కొందరు పోలీసు అధికారుల తీరు మాత్రం మారలేదు. ఇంకా జగన్ భజనే చేస్తున్నారు. వీరికి తోడు అక్కడక్కడా ఎన్నికల అధికారులూ వంతపాడుతున్నారు. ఎన్నికల సంఘం ఒకటుందనే భయం వారికి లేదు. వైఎస్సార్సీపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లతో ఉన్నవారెవరైనా స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేసేందుకు వస్తే దగ్గరుండి అడ్డుకున్నారు. అదే టీడీపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల పేర్లతో ఉన్న వారెవరైనా ఉంటే దగ్గరుండి నామినేషన్ వేసేందుకు తోడ్పాటు అందించారు.

గంటా శ్రీనివాసరావు :చివరి రోజు నాటకీయ పరిణామాల మధ్య నామినేషన్ల పర్వం కొనసాగింది. భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం మండలం గంటా పేటకు చెందిన గంటా శ్రీనివాసరావు అనే పేరున్న వ్యక్తి భీమిలి అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. అక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు బరిలో నిలిచారు. నామినేషన్ల దాఖలు గడువు మరో 3 నిమిషాల్లో ముగుస్తుందనగా గంటాపేటకు చెందిన శ్రీనివాసరావు జాతీయ జనసేన పార్టీ అభ్యర్థిగా నామినేషన్ సమర్పించారు. వైఎస్సార్సీపీ నేతల ప్రమేయంతోనే ఇది జరిగినట్లు చెబుతున్నారు.

విడదల రజిని, మురుగుడు లావణ్య కిడ్నాప్- నామినేషన్ అడ్డుకున్నYSRCP - Vidadala Rajini Kidnapped

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన అభ్యర్థిగా బత్తుల బల రామకృష్ణ బరిలో ఉన్నారు. ఇదే పేరుతో జాతీయ జనసేన పార్టీ, నవరంగ్ కాంగ్రెస్, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులుగా 6 నామినేషన్లు దాఖలయ్యాయి. జనసేన అభ్యర్థి భార్య బత్తుల వెంకటలక్ష్మి ఒక నామినేషన్ దాఖలు చేయగా అదే పేరుతో మరో ఇద్దరు నామినేషన్లు వేశారు. కోనసీమ జిల్లా పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి జనసేన తరపున గిడ్డి సత్యనారాయణ బరిలో ఉన్నారు. అదే పేరుతో మరో ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. వీరి నామినేషన్ల వెనుకా వైఎస్సార్సీపీ హస్తం ఉందని వివిధ పార్టీల నేతలు అనుమానం వ్యక్తం చేశారు.

వైఎస్సార్సీపీ నేతలు చాలాచోట్ల జాతీయ జనసేన పార్టీ, నవరంగ్ కాంగ్రెస్, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ తదితర పార్టీల తరపున కూటమి అభ్యర్థుల పేర్ల మాదిరే ఉన్న వ్యక్తులతో చివరి రోజున నామినేషన్లు దాఖలు చేయించారు. మచిలీపట్నం లోక్‌సభకు జనసేన అభ్యర్థిగా బాలశౌరి పోటీ చేస్తున్నారు. ఆ నియోజక వర్గానికి అదే పేరున్న ఇద్దరు వేర్వేరు పార్టీల తరపున నామినేషన్లు దాఖలు చేశారు. నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి బాలశౌరమ్మ పాముల, జాతీయ జనసేన పార్టీ నుంచి బాలశౌరి సీహెచ్ పేరుతో ఈ నామినేషన్లు దాఖలయ్యాయి. ఇదొక కుట్ర అని, దీని వెనుక మాజీ మంత్రి పేర్ని నాని ఉన్నట్లు జనసేన నేతలు ఆరోపించారు.

మురుగుడు లావణ్య V/S మురుగుడు లావణ్య : గుంటూరు జిల్లా మంగళగిరిలో మురుగుడు లావణ్య స్వతంత్ర అభ్యర్థిగా అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదే నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా మురుగుడు లావణ్య పోటీ చేస్తున్నారు. అదే పేరుతో మరొకరు పోటీ చేస్తే ఇబ్బంది అనే భయంతో వైసీపీ నేతలు ఆమెను పోటీ నుంచి తప్పించేందుకు సిద్ధమయ్యారు. టిడ్కో గృహ సముదాయంలో ఉన్న బంధువుల ఇంట్లో ఉన్నారని తెలిసి వైసీపీ నాయకులు అక్కడకు చేరుకుని గృహనిర్బంధం చేశారు. నామినేషన్ వేయొద్దని హెచ్చరించారు. సుమారు గంటపాటు ఈ తతంగం నడిచింది. అనంతరం ఆమెను కుటుంబసభ్యుల్ని వాహనాల్లో ఎక్కించుకుని తీసుకెళ్లారు.

వైసీపీ నాయకులు లావణ్య ఇంటికి వచ్చారని తెలిసిన టీడీపీ నాయకులు అక్కడకు చేరుకున్నారు. ఆవెంటనే సీఐ శ్రీనివాసరావు, పోలీసులు అక్క చేరుకుని టీడీపీ నాయకులు, కార్యకర్తలను అక్కడ నుంచి బలవంతంగా పంపించారు. వైసీపీ నేతలు సుమారు 60 మంది వరకు లావణ్య ఇంటి చుట్టూ ఉన్నా ఎంతమాత్రం పట్టించుకోలేదు. వాహనాల్లో వైసీపీ నేతలు వచ్చి లావణ్యతోపాటు ఆమె కుటుంబ సభ్యులను తీసుకెళ్తున్నా దగ్గరుండి సాగనంపి విధేయత ఒలికించారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సూచనలతోనే పోలీసులు వైసీపీకు అనుకూలంగా వ్యవహరించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణుల రాళ్లదాడి - తిరుపతిలో ఉద్రిక్తత - YCP Activists Attack TDP Activists

విడదల రజని V/S విడదల రజని : గుంటూరు ఏసుభక్తనగర్‌కు చెందిన విడదల రజని అనే ఎస్సీ మహిళ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గురువారం నామినేషన్ వేయటానికి సిద్ధమయ్యారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా మంత్రి విడదల రజిని పోటీ చేస్తున్నారు. వైసీపీ నేతలు ఎస్సీ మహిళ విడదల రజినిని అడ్డుకున్నారు. తన కుమార్తెను ఎవరో కిడ్నాప్ చేశారని ఆమె తండ్రితో డయల్ 100కు ఫోన్ చేయించారు. వారు సెల్ఫోన్ లొకేషన్ ద్వారా ఆమెను గుర్తించి ఇద్దరు కానిస్టేబుళ్లు, ఎస్సై వెళ్లి తమవెంట రావాలని ఆదేశించారు. బలవంతంగా నగరంపాలెం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి తండ్రికి అప్పగించారు.

అప్పటికే అక్కడున్న వైసీపీ నేతలు ఆమెను కారులో ఎక్కించుకుని తీసుకుపోయి నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. భర్త అనురాగరావు వచ్చి ఆమె ఎక్కడుందో చూపాలని నిలదీయడంతో తండ్రికి అప్పగించామని చెప్పారు. సాయంత్రం వరకు ఆయనను పోలీస్ స్టేషన్‌ లోపలే నిర్బంధించి నామినేషన్ల దాఖలు సమయం ముగిశాక వదిలిపెట్టారు. పోలీసు స్టేషన్ ఆవరణలోనే వైసీపీ నేతలు రజనితో ఉపసంహరణ పత్రాలపై సంతకం పెట్టించినట్లు చెబుతున్నారు. అంటే ఈ అరాచకమంతటికీ ప్రత్యక్ష సాక్షులు పోలీసులే. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని బాధితురాలే చెబుతున్నా పట్టించుకోలేదంటే.. ఖాకీ దుస్తులేసుకున్న ఈ వీరభక్త వైసీపీ కార్యకర్తలు ఎంత ఏకపక్షంగా వ్యవహరించారో అర్ధమవుతుంది.

అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే గుంటూరు, కృష్ణా ఎస్పీలను ఎన్నికల సంఘం బాధ్యతల నుంచి తప్పించినా అక్కడ పరిస్థితి మారలేదని తెలుగుదేశం నేతలు అన్నారు. కొందరు పోలీసులు ఇప్పటికీ వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తూ వారితో అంటకాగుతున్నారని ఆరోపించారు. ఇంతజరుగుతున్నా ఇటీవలే బాధ్యతలు తీసుకున్న గుంటూరు ఎస్పీ తుషార్ రూడీ, కృష్ణా ఎస్సీ అద్నాన్ నయీం హస్మి చర్యలు చేపట్టలేదన్నారు. వైసీపీ నేతలతో అంటకాగే అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసారు.

కొడాలి వెంకటేశ్వరరావు V/S కొడాలి వెంకటేశ్వరరావు :కొడాలి వెంకటేశ్వరరావు అనే పేరున్న దళిత దివ్యాంగ యువకుడు నామినేషన్ వేసేందుకు వస్తే గుడివాడ ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి పద్మావతికి ఆగ్రహం వచ్చింది. కుచ్చికాయలపూడి గ్రామానికి చెందిన కొడాలి వెంకటేశ్వరరావు నామినేషన్ వేయడానికి వచ్చారు. అక్కడున్న ఈఆర్వో, ఆర్డీవో పద్మావతి నామినేషన్ తీసుకోవడానికి నిరాకరించారు. తక్షణమే బయటకు వెళ్లాలని అవమానకరంగా మాట్లాడారు. వెంకటేశ్వరరావుపై క్రిమినల్ కేసు నమోదు చేయమంటూ అక్కడే ఉన్న పోలీసులను ఆదేశించారు. ఇదెక్కడి అన్యాయమంటూ ఆయన ఈఆర్వో కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు.

దీంతో పోలీసులు వచ్చి ఇక్కడ వాగ్వాదానికి దిగితే క్రిమినల్ కేసు నమోదు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. న్యాయవాదులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నామినేషన్ వేయకుండా వెంకటేశ్వరరావును ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ పోలీసులు వారిని కూడా హెచ్చరించారు. నామినేషన్ వేసే హక్కును హరించడానికి మీరెవరంటూ అందరూ కలిసి వాగ్వాదానికి దిగడంతో.. చివరికి అనుమతించారు. 'నా పేరు కొడాలి వెంకటేశ్వరరావు కావడమే నా తప్పా అని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.

తంగిరాల సౌమ్య V/S తంగిరాల సౌమ్య : ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా తంగిరాల సౌమ్య పోటీ చేస్తుండగా, అదే పేరున్న విజయవాడకు చెందిన తంగిరాల సౌమ్యతో వైసీపీ నేతలు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయించారు. ఓట్లను చీల్చేందుకు వైసీపీ నాయకులు ఇలా కుట్ర పన్నారని టీడీపీ నేతలు ఆరోపించారు.

మరోవైపు నందిగామలో నామినేషన్ సందర్భంగా పోలీసు అధికారుల వైఖరిపై విమర్శలు వెల్లువెత్తాయి. వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు నామినేషన్ వేసేందుకు ఆర్డిఓ కార్యాలయానికి రాగా పోలీసులు ఆయనకు రాజమార్గం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కారును నేరుగా ఎన్నికల అధికారి రూమ్‌ వరకు నందిగామ గ్రామీణ సీఐ చంద్రశేఖర్‌తో పాటు ఇతర పోలీసులు అనుమతించారు. అదే కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య వచ్చినప్పుడు మాత్రం ఆమె కారును గేటు బైట ఆపి నడిచిపొమ్మన్నారు. కాంగ్రెస్, బీఎస్పీతో పాటు స్వతంత్ర అభ్యర్థుల కార్లను పోలీసులు బైటే ఆపారు. పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.

ముగిసిన నామినేషన్ల గడువు- 13న పోలింగ్​ రేసులో నిలిచేదెవరో! - elections nominations

ABOUT THE AUTHOR

...view details