Former Minister Viveka Murder Case Approver Dastagiri :ఐదు సంవత్సరాల పాటు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి, ఎంపీ అవినాష్‌రెడ్డి తనను తీవ్ర ఇబ్బందులు గురి చేశారని మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్ మారిన దస్తగిరి ఆరోపించారు. ఈ మేరకు కడపలో జిల్లా ఎస్పీ హర్షవర్దన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. గత ఏడాది నవంబర్‌లో తాను కడప జైల్లో ఉన్న సమయంలో జైలు అధికారులు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి ప్రలోభ పేట్టిన అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని ఎస్పీని కోరారు.
సీసీ టీవీ ఫుటేజ్‌ను జైలు అధికారులు ఎందుకు తొలగించారు? : గత ఏడాది నవంబర్ 28న వైద్య శిబిరం పేరుతో జైలులోకి వచ్చిన చైతన్య రెడ్డి తనను బెదిరించి రాజీకి రావాలని డబ్బు ఆఫర్ చేశాడని తెలిపారు. ఆయన మాట వినకపోవడంతో కడప జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్ తనను వారం రోజుల పాటు ఓ గదిలో వేసి నిర్బంధించి హింసించారని ఆరోపించారు. ఆ సమయంలో ఓ కేసులో అరెస్ట్ అయిన తెలుగుదేశం నేత బీటెక్ రవి కూడా తన పక్క బ్యారెకులోనే ఉన్నాడని, ఆయన్ని కూడా సాక్ష్యంగా విచారించాలని దస్తగిరి డిమాండ్ చేశారు. గత ఏడాది నవంబర్ 28 నాటి జైలులో సీసీ టీవీ ఫుటేజ్‌ను జైలు అధికారులు ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్న దస్తగిరి.. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోనైనా తనకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
హోం మంత్రి అనితతో వైఎస్ సునీత భేటీ - వివేకా హత్యపై వివరణ - YS Sunitha Met Home Minister Anitha