Sharmila Election Campaign In Pulivendula: ఏపీ వైసీపీ ఎంపీ అవినాశ్‌ను ఓడించి జగన్‌కు బుద్ధి చెప్పండి అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఓటర్లను కోరారు. పులివెందుల నియోజకవర్గం వేంపల్లెలో తన సోదరి సునీతతో కలిసి ఆమె ప్రచారం నిర్వహించారు. రాముడికి లక్ష్మణుడు ఎలాగో వైఎస్‌కు వివేకా అలాంటివారే, ప్రజల మనిషి వివేకా. అలాంటి నాయకుడు ఎక్కడా కనిపించని పరిస్థితి అని షర్మిల వాపోయారు.
ప్రజల మనిషి వివేకాను ఘోరంగా నరికి చంపేశారని, ఐదేళ్లయినా హత్యచేసిన వారికి, చేయించిన వారికి శిక్ష పడలేదని వాపోయారు. హత్య చేసినవాళ్లు, చేయించినవాళ్లు యథేచ్ఛగా తిరుగుతున్నారని మండిపడ్డారు. చిన్నాన్న హత్య విషయాలను గుర్తు చేసుకొని కంటతడి పెట్టిన షర్మిల ఎవరికి ఓటేస్తారో తేల్చుకోవాలని గద్గద స్వరంతో ప్రజలను కోరారు.
Congress leader Sharmila On Y.S Viveka Death :పులివెందుల నియోజకవర్గం(Constituency) వేంపల్లెలో వైఎస్ షర్మిలారెడ్డి, ఆమె సోదరి వైఎస్ వివేకా కూతురు సునీత ఎన్నికల ప్రచారం(Election Campaign) నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ప్రజల మనిషి వివేకాను ఘోరంగా నరికి చంపేశారని తెలిపారు. వివేకా గొడ్డలి పోట్లకు బలైపోయి ఐదేళ్లయినా ఇవాళ్టివరకు హత్యచేసిన వారికి, చేయించిన వారికీ శిక్ష పడలేదని పేర్కొన్నారు.
వివేకాను హత్య చేసినవాళ్లు, హత్య చేయించినవాళ్లు యథేచ్ఛగా తిరుగుతున్నారని అన్నారు. వైఎస్ అవినాశ్‌రెడ్డి నిందితుడని సీబీఐ చెబుతోందన్న వైఎస్ షర్మిల డబ్బు లావాదేవీల వంటి అన్ని సాక్ష్యాలను(Evidence) సీబీఐ బయటపెట్టిందని తెలిపారు. సాక్షాత్తు సీఎం జగన్ తన అధికారాన్ని అడ్డేసి హంతకులను కాపాడుతున్నారని ధ్వజమెత్తారు.
Ys Sharmila Fires On CM Jagan :హంతకులను కాపాడుకోవడం న్యాయమా? అని జగన్‌ను ప్రశ్నిస్తున్నా, సొంత చిన్నాన్నకే న్యాయం చేయకపోతే ఇంకెవరికి న్యాయం చేస్తారు? అని నిలదీశారు. ప్రజలు నమ్మి అధికారం ఇస్తే హంతకుడిని కాపాడుకుంటారా? అని షర్మిల ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా అవినాశ్‌ను జైలుకు పంపలేదని, ఐదేళ్లు అధికారంలో ఉండి అవినాశ్‌కు శిక్ష పడకుండా కాపాడుతున్నారని, మళ్లీ అదే హంతకుడికి టిక్కెట్ ఇస్తారా? అని షర్మిల మండిపడ్డారు.