Cong Nalgonda MP Candidate Raghuveer Reddy Nomination :నల్గొండలో బీజేపీ, బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రావని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి, నల్గొండ జిల్లాకి ఏమీ చేయని బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ మనుగడ ఉండదని ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు వచ్చే సీట్లు 'సున్న' అని వ్యాఖ్యానించారు. నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరైన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
Minister Uttam Kumar Reddy Fires On BRS BJP :రఘువీర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మాట్లాడినఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీలపై మండిపడ్డారు. రైతులకు కనీసమద్ధతు ధర ఇస్తామన్న బీజేపీ ఇవ్వలేదన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి మరిచారని ఆరోపించారు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్లనే జిల్లాలో అభివృద్ధి జరగలేదన్నారు.కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు. పార్టీ ఘన విజయం సాధించేందుకు కార్యకర్తలందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ పార్టీ మనుగడ కోల్పోతుందని జోస్యం చెప్పారు.
ఆరు గ్యారంటీలు అమలు చేయాలన్న లక్ష్యంతో ప్రజాపాలన : మంత్రి ఉత్తమ్‌కుమార్