తెలంగాణ

telangana

ETV Bharat / politics

కాంగ్రెస్‌ ఎంపీ టికెట్ల కోసం పోటాపోటీ - 140 దాటిన అర్జీలు - ఆ 3 స్థానాలపై ప్రముఖుల గురి - Congress MP Tickets Application 24

Congress MP Tickets Applications 2024 : లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్ల కోసం పోటాపోటీ నెలకొంది. శుక్రవారం ఒక్క రోజే వంద మంది అర్జీ పెట్టుకున్నారు. రిజర్వ్‌డ్‌ స్థానాలకు అధిక సంఖ్యలో పోటీ పడుతున్నారు. మరోవైపు ఖమ్మం, మల్కాజిగిరి, నల్గొండలపై ప్రముఖులు గురి పెట్టారు. దరఖాస్తుదారుల్లో ప్రజారోగ్య శాఖ మాజీ సంచాలకుడు గడల శ్రీనివాసరావు ఉన్నారు. నేటితో గడువు ముగియనుండటంతో దరఖాస్తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.

Telangana Congress
Telangana Congress

By ETV Bharat Telangana Team

Published : Feb 3, 2024, 11:48 AM IST

Updated : Feb 3, 2024, 12:26 PM IST

Congress MP Tickets Applications 2024 :రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు హస్తం పార్టీ నుంచి టికెట్లను ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం ఒక్కరోజే 100 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. దీంతో ఇంతవరకు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 140 దాటింది. కాంగ్రెస్‌లో టికెట్ల కోసం దరఖాస్తు దాఖలుకు గడువు నేటితో ముగియనుంది. రిజర్వ్‌డ్ స్థానాలైన వరంగల్‌, పెద్దపల్లి, మహబూబాబాద్‌, నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గాలకు అత్యధికంగా, హైదరాబాద్‌కు అతితక్కువగా అర్జీలు అందాయి.

Competition For Congress MP Tickets 2024 :ఈరోజు సాయంత్రం 5 గంటల వరకూ గడువు ఉన్నందున అర్జీల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. మల్కాజిగిరి, నల్గొండ, ఖమ్మంలో పార్టీ తప్పకుండా గెలుస్తుందని నమ్ముతున్న పలువురు నాయకులు (Congress MP Tickets) టికెట్ తమకే ఇవ్వాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. శుక్రవారం పలువురు మాజీ ప్రజాప్రతినిధులు దరఖాస్తు చేసుకున్నారు.

14 లోక్​సభ స్థానాలే టార్గెట్ - గెలుపు గుర్రాల ఎంపికపై నేడు కాంగ్రెస్​ కీలక సమావేశం

Congress MP Ticket Application Last Date Today : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె.జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్‌రెడ్డికి నల్గొండ టికెట్‌ కోసం ఆయన తమ్ముడు, ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి గాంధీభవన్‌కు వచ్చి అర్జీ అందించారు. ఖమ్మం టికెట్‌ కోరుతూ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్‌రెడ్డి తరఫున ఆయన అనుచరులు దరఖాస్తు అందజేశారు. ఖమ్మంలో పోటీకి మాజీ ఎంపీ వీహెచ్‌, ఉప ముఖ్యమంత్రి భట్టి సతీమణి ఇప్పటికే దరఖాస్తులిచ్చారు. ఇదే టికెట్‌ కావాలని మాజీ మంత్రి రేణుకాచౌదరి కూడా పట్టుబడుతున్నారు.

కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ మల్కాజిగిరితో పాటు పెద్దపల్లి, నాగర్‌కర్నూల్‌, వరంగల్‌ స్థానాల నుంచి అర్జీ చేసుకున్నారు. ఏఐసీసీ కార్యదర్శి, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన సంపత్‌కుమార్‌ నాగర్‌కర్నూల్‌ టికెట్‌ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. ఇదే స్థానం కోసం దిల్లీ తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి, పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి (Mallu Ravi) ప్రయత్నం చేస్తున్నారు. మల్కాజిగిరికి సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ దరఖాస్తు చేశారు.

Congress MP Candidates 2024 Telangana : ప్రజారోగ్య శాఖ సంచాలకుడిగా పనిచేస్తూ ఇటీవల బదిలీ అయిన డాక్టర్‌ గడల శ్రీనివాసరావు కాంగ్రెస్‌ పార్టీ నుంచి అర్జీ పెట్టుకున్నారు. శుక్రవారం ఆయన అనుచరులు గాంధీభవన్‌కు వచ్చి సికింద్రాబాద్‌, ఖమ్మం స్థానాల టికెట్ల కోసం దరఖాస్తులు ఇచ్చారు. ఆయన గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజారోగ్యశాఖలో సంచాలకుడిగా పనిచేస్తూ ఆ పార్టీ తరఫున శాసనసభ ఎన్నికల్లో టికెట్‌ కోసం గట్టిగా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌ తరఫున లోక్‌సభ టికెట్‌ అడుగుతున్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో విజయకేతనమే లక్ష్యం - రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల 'హస్త'గతం దిశగా కసరత్తులు

దరఖాస్తు చేసినవారిలో ఏఐసీసీ మాజీ సభ్యుడు చింతల యాదగిరి (మల్కాజిగిరి, భువనగిరి, వరంగల్), తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ ఛైర్మన్‌ గజ్జెల కాంతం (పెద్దపల్లి), రుద్ర సంతోష్‌ కుమార్‌ (కరీంనగర్‌), పీసీసీ ఉపాధ్యక్షుడు ఎంఆర్‌జీ వినోద్‌రెడ్డి (మల్కాజిగిరి, సికింద్రాబాద్), పీసీసీ అధికార ప్రతినిధి భవానీరెడ్డి (మెదక్‌), పీసీసీ శిక్షణ కమిటీ సభ్యుడు ఊట్ల వరప్రసాద్‌ (పెద్దపల్లి), పీసీసీ కార్యదర్శి పెర్క శ్యామ్‌ (పెద్దపల్లి), వీవీసీ గ్రూప్‌ సంస్థల ఎండీ రాజేంద్రప్రసాద్‌ (ఖమ్మం), రాష్ట్ర విద్యుత్‌ ఉద్యోగుల సంఘం నేత పి.సదానందం (వరంగల్‌) తదితరులు ఉన్నారు. వరంగల్‌కు డాక్టర్‌ పరమేశ్వర్‌, మహబూబాబాద్‌కు తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ భట్టు రమేశ్‌ నాయక్‌ గాంధీభవన్‌కు వచ్చి దరఖాస్తు అందజేశారు.

Telangana Congress Parliament Elections 2024 : తెలంగాణలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు అయిన స్థానాల కోసం పెద్దసంఖ్యలో పోటీపడుతున్నారు. ఒక్కో అభ్యర్థి తమ వర్గానికి రిజర్వ్ అయిన అన్ని స్థానాలకు దరఖాస్తులు ఇస్తుండటం గమనార్హం. ఎక్కడ అవకాశం ఇచ్చినా పోటీచేస్తామని చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్‌ అధికారులు, పలు సంఘాల వారూ టికెట్లు ఆశిస్తున్నారు.

లోక్​సభ బరిలో కొత్త అభ్యర్థులు - మల్కాజిగిరి స్థానం నుంచి బడా వ్యాపారవేత్త!

లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ - ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు షురూ

Last Updated : Feb 3, 2024, 12:26 PM IST

ABOUT THE AUTHOR

...view details