Congress Manifesto Committee Meeting at Sachivalayam : తెలంగాణలో ఏర్పాటైన నూతన ప్రభుత్వంపై ప్రతిపక్షం చేస్తున్న విమర్శలు చాలా తొందరపాటుగా ఉన్నాయని మంత్రి శ్రీధర్ బాబు ఆక్షేపించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఎంతో విశ్వాసాన్ని చూపారని తెలిపారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలన(Congress Six Guarantees) ఇచ్చామని అధికారంలోకి రాగానే వాటిని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. గాంధీభవన్‌లో టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ సమావేశం పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన ప్రారంభమయింది. ఇటీవలే సేకరించిన ప్రజాపాలన దరఖాస్తులు గురించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఎమ్మెల్సీలుగా మహేశ్‌కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ఎన్నిక ఏకగ్రీవం - ఈసీ ప్రకటన
Minister Sridhar Babu on Manifeso Committee: ఆరు గ్యారంటీల అమలుకు తదుపరి కార్యచరణ రూపొందించేందుకు తగిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రజాపాలన ప్రక్రియలో భాగమైన కంప్యూటరీకరణ చివరి దశకు చేరుకుందని తెలుస్తోంది. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపదాస్ మున్షి, ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరీ, మన్సూర్ అలీ ఖాన్, ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Gowd), మేనిఫెస్టో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.