CM Revanth Review on Bhuvanagiri Lok Sabha :పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలకు పదునుపెడుతోంది. ఒకవైపు నుంచి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని మొదలు పెట్టగా ఆ రెండు పార్టీల దూకుడుకు కళ్లెం వేసేందుకు హస్తం పార్టీ ప్రత్యేక ప్రణాళికలను రచిస్తోంది. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు కార్యకర్తలను, నేతలను మేల్కొపుతూ నియోజకవర్గాల వారీగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reviews) వరుస సమీక్షలతో బిజీబిజీగా గడుపుతున్నారు.
ఈసారి ఎలాగైనా తెలంగాణ నుంచి కాంగ్రెస్ 14 స్థానాల్లో విజయం సాధించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. ఈ క్రమంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశాలతో పాటు పార్టీ ఎక్కడ బలహీనంగా ఉందో తెలుసుకుని వాటిని సరిదిద్దుకునే విధంగా సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు. తాజాగా సమీక్షలో భాగంగా బుధవారం భువనగిరి లోక్సభ నియోజకవర్గ ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. పార్లమెంటు ఇంఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో ఈ సమావేశం జరగనుంది.
ఈ సమీక్ష మీటింగ్కు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఇందులో భువనగిరి లోక్సభ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి(Bhuvanagiri Congress MP Candidate Kiran Kumar Reddy), ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మందుల శామేలు, వేముల వీరేశం, మల్రెడ్డి రంగారెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యలతో పాటు ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేకంగా నియమితులైన కో ఆర్డినేటర్లు కూడా హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో సీఎం రేవంత్ భేటీ