తెలంగాణ

telangana

ETV Bharat / politics

హరీశ్​రావు రాజీనామా పత్రం జేబులో పెట్టుకో - కేసీఆర్​లాగా మాట తప్పొద్దు : రేవంత్​ రెడ్డి - Revanth Reddy Speech in Warangal

Congress Jana Jathara Meeting at Madikonda : ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్న మాజీ మంత్రి హరీశ్​రావు వ్యాఖ్యలపై సీఎం రేవంత్​ రెడ్డి వరంగల్​ సభా వేదికగా స్పందించారు. పంద్రాగస్టులోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరతామన్న ముఖ్యమంత్రి, హరీశ్​రావు రాజీనామా పత్రం జేబులో పెట్టుకోవాలని సూచించారు.

revanth reddy  Jana Jathara Meeting
Congress Jana Jathara Meeting at Madikonda

By ETV Bharat Telangana Team

Published : Apr 24, 2024, 7:13 PM IST

Updated : Apr 24, 2024, 7:40 PM IST

హరీశ్​రావు రాజీనామా పత్రం జేబులో పెట్టుకో - కేసీఆర్​లాగా మాట తప్పొద్దు : రేవంత్​ రెడ్డి

Congress Jana Jathara Meeting in Hanamkonda :వరంగల్‌ అంటే దేశానికే తలమానికమైన పీవీ గుర్తుకొస్తారని, వరంగల్​ పేరు చెబితే కాళోజీ, జయశంకర్​లు మదిలో మెదులుతారని సీఎం రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్​ తర్వాత అంతటి స్థాయి ఉన్న వరంగల్‌కు ఔటర్‌ రింగ్‌ రోడ్డుతో పాటు విమానాశ్రయం తీసుకొస్తామని స్పష్టం చేశారు. వరంగల్‌కు మహర్దశ తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామన్న సీఎం, వరంగల్‌ను పట్టి పీడిస్తున్న చెత్త సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్‌, ఖమ్మంలో చెత్త ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తామన్న సీఎం రేవంత్​ రెడ్డి, వరంగల్‌కు పెట్టుబడులు తీసుకొస్తామని స్పష్టం చేశారు.

ఈ క్రమంలోనే మామ, అల్లుళ్లు (కేసీఆర్, హరీశ్​రావు) తోక తెగిన బల్లుల్లా ఎగురుతున్నారని రేవంత్​ రెడ్డి దుయ్యబట్టారు. తమ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టామని గొప్పలు చెప్పుకున్నారని, అప్పుడే అది కూలిపోయిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలపై చర్చిద్దాం రావాలని సవాల్​ విసిరారు. రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు చేపడితే, మేడిగడ్డ మేడిపండు అయిందని, సుందిళ్ల సున్నం అయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ హయాంలో కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో చూడాలని బీఆర్​ఎస్​కు హితవు పలికారు.

ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తే బీఆర్​ఎస్​ను రద్దు చేస్తారా? - హరీశ్‌రావుకు సీఎం రేవంత్​ రెడ్డి సవాల్

మామాఅల్లుళ్లు తోక తెగిన బల్లుల్లా ఎగిరిపడుతున్నారు. అసెంబ్లీకి రాని కేసీఆర్‌, టీవీలో గంటల పాటు కూర్చున్నారు. మెదడు కరిగించి కాళేశ్వరం కట్టామని కేసీఆర్‌ చెప్పారు. కేసీఆర్‌ అలా కాళేశ్వరం కట్టాడో లేదో ఇలా కూలింది. కేసీఆర్‌కు సూటిగా సవాల్‌ విసురుతున్నా. కాళేశ్వరం రండి చూద్దాం. కాళేశ్వరం దగ్గరే కూర్చుని నిపుణులతో చర్చిద్దాం. కేసీఆర్‌కు దమ్ము ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం రావాలి. - రేవంత్​ రెడ్డి, ముఖ్యమంత్రి

ఈ పార్లమెంట్​ ఎన్నికల్లో బీఆర్​ఎస్​కు డిపాజిట్లు వచ్చే పరిస్థితులు లేవని రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు. పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తామని అంటున్నారంటూ హరీశ్​రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్న రేవంత్​ రెడ్డి, హరీశ్‌ రావు రాజీనామా పత్రం జేబులో పెట్టుకోవాలని సూచించారు. కేసీఆర్‌ మాదిరిగా హరీశ్‌ రావు మాట తప్పొద్దన్నారు.

రూ.2 లక్షల రుణమాఫీపై సీఎం కీలక ప్రకటన - కోడ్​ ముగియగానే ప్రక్రియ ప్రారంభం

రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తామంటున్నారు. ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం. హరీశ్‌రావు రాజీనామా పత్రం జేబులో పెట్టుకోవాలి. మామ కేసీఆర్‌ మాదిరిగా హరీశ్‌రావు మాట తప్పొద్దు. - సీఎంరేవంత్​ రెడ్డి

వరంగల్​ అభివృద్ధి బాధ్యత నాది : మరోవైపు ప్రజలకు చిత్తశుద్ధితో సేవలందించే నాయకులు కావాలని సీఎం రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు. టికెట్‌ కోసం కడియం శ్రీహరి కాంగ్రెస్‌ను సంప్రదించలేదన్న ఆయన, ఆయన నిజాయతీ చూసి కావ్యకు టికెట్‌ ఇచ్చామని తెలిపారు. వరంగల్‌ అభివృద్ధి, అవసరాలు తీర్చే బాధ్యత తనదని, వరంగల్‌కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే బాధ్యత తాను తీసుకుంటామని చెప్పారు. కావ్యకు, భూములు మింగిన అనకొండకు మధ్య పోటీ అని, కాంగ్రెస్​కు ఓటు వేసి కావ్యను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు.

ఛాలెంజ్ యాక్సెప్టెడ్ - ఆ హామీలన్నీ అమలు చేస్తే నేను రాజీనామా చేస్తా - మళ్లీ పోటీ చేయను : హరీశ్ రావు

Last Updated : Apr 24, 2024, 7:40 PM IST

ABOUT THE AUTHOR

...view details