CM Revanth Reddy Meet with Parliament Constituency Leaders :పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలకు పదును పెట్టింది. శనివారం తుక్కుగూడలో జరిగిన జన జాతర సభ విజయవంతం కావడంతో కార్యకర్తలు, కేడర్‌లో నూతనోత్సాహం నెలకొంది. ఈ క్రమంలో తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు సీట్లకు గానూ 14 గెలిచి తీరుతామని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం రాష్ట్రంలో 14 స్థానాలు గెలిచి సోనియాగాంధీకి బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకుని వరుసపెట్టి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థులు, ఇంఛార్జిలు, నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో ముందుగా వరంగల్ నియోజకవర్గ ముఖ్య నేతలతో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, వేం నరేందర్ రెడ్డి, వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వీరికి సీఎం రేవంత్ రెడ్డి గెలుపు వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలో బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు ప్రజలు పట్టం కట్టే విధంగా చేయాలని సూచించారు.
రాష్ట్రంలో రోజురోజుకూ మారుతోన్న రాజకీయ పరిణామాలు - చేరికల తలుపులు తెరిచిన కాంగ్రెస్