తెలంగాణ

telangana

ETV Bharat / politics

సోనియా గాంధీతో ముగిసిన సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ - తెలంగాణ నుంచి లోక్​సభ​కు పోటీ చేయాలని వినతి

CM Revanth Reddy Delhi Tour 2024 : కాంగ్రెస్​ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో, సీఎం రేవంత్‌రెడ్డి భేటీ ముగిసింది. సుమారు అరగంట పాటు పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్​తో పాటు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారి మర్యాదపూర్వకంగా పార్టీ అగ్రనేతను కలిశారు. లోకసభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచే పోటీ చేయాలని గట్టిగా కోరినట్లు డిప్యూటీ భట్టి తెలిపారు.

By ETV Bharat Telangana Team

Published : Feb 5, 2024, 5:46 PM IST

Updated : Feb 5, 2024, 11:02 PM IST

Congress Latest News
CM Revanth Reddy Reached Delhi

CM Revanth Reddy Delhi Tour 2024 : రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాల‌ని కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ ఛైర్‌ప‌ర్స‌న్ సోనియా గాంధీకి రాష్ట్ర ముఖ్య‌మంత్రి, పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. తెలంగాణ నుంచి పోటీ చేయాల‌ని కోరుతూ ఇప్ప‌టికే పీసీసీ తీర్మానించిన విష‌యాన్ని ఆయ‌న అధినేత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సోనియా గాంధీ(Sonia Gandhi) స‌రైన స‌మ‌యంలో నిర్ణ‌యం తీసుకుంటాన‌ని తెలిపారు. సుమారు అరగంటపాటు సాగిన ఈ భేటీలో సీఎం రేవంత్​తో పాటు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి పాల్గొన్నారు.

పార్లమెంట్‌ ఎన్నికలపై కాంగ్రెస్‌ దృష్టి - గెలిచే సత్తా ఉన్న అభ్యర్ధుల కోసం వేట

తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారి పార్టీ అగ్రనేతతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యామని ఉప ముఖ్యమంత్రి భట్టి తెలిపారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న హామీల‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సోనియాగాంధీకి తెలియ‌జేశారు. ఎన్నిక‌లకు ముందు ఇచ్చిన ఆరు హామీల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం, రాజీవ్ ఆరోగ్య‌శ్రీ(Rajiv Arogya Shri) ప‌రిమితిని రూ.5 ల‌క్ష‌ల నుంచి రూ.15 ల‌క్ష‌లకు పెంచ‌డాన్ని అమ‌లు చేస్తున్నామ‌ని వివ‌రించారు.

Congress Six Guarantees Implementation :బ‌స్సుల్లో ఇప్ప‌టికే 14 కోట్ల మంది మ‌హిళ‌లు ఉచిత ప్ర‌యాణం చేశార‌ని ఆయ‌న తెలిపారు. రూ.500కే గ్యాస్ సిలెండ‌ర్ అంద‌జేత‌, 200 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్ ఉచిత స‌ర‌ఫ‌రా అమ‌లుకు నిర్ణ‌యం తీసుకున్నామ‌ని సోనియా గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి తెలియ‌జేశారు. బీసీ కుల గ‌ణ‌న(BC Caste Census) చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించామ‌ని, ఇందుకు సంబంధించి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని సోనియా గాంధీకి రేవంత్ వివరించారు.

పార్లమెంట్ ఎన్నికలు 2024 - తెలంగాణ నుంచి పోటీకి సోనియా గాంధీ సుముఖత, ఆ స్థానం నుంచే బరిలోకి!

రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో అత్య‌ధిక స్థానాలు సాధించేందుకు వీలుగా ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని, ఇందుకు సంబంధించి ఇప్ప‌టికే అన్ని ర‌కాలుగా స‌న్నాహాలు పూర్తి చేసిన‌ట్లు ముఖ్య‌మంత్రి, అధినేత్రికి తెలిపారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌తి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం(Parliament Constituency) నుంచి ఆశావహుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించామ‌ని, వాటిపై పూర్తిస్థాయిలో క‌స‌ర‌త్తు చేసి బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తామ‌ని ఆయ‌న వివ‌రించారు.

Congress PEC Meeting in Hyderabad :దిల్లీ నుంచి తిరిగి మంగళవారం రోజున రేవంత్ రెడ్డి రాష్ట్రానికి రానున్నారు. గాంధీభవన్​లో పార్లమెంట్​ అభ్యర్థుల ఎంపికపై మంగళవారం రోజున కాంగ్రెస్ ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ భేటీలో పార్లమెంట్ ఎన్నికల్లో(Lok Sabha Elections) పోటీ చేసే ఆశావహుల జాబితాపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

నీతి ఆయోగ్ వైస్ ఛైర్మ‌న్ సుమ‌న్ భేరీకి ముఖ్య‌మంత్రి విన‌తి

CM Revanth Meet to NITI Aayog Vice Chairman Suman Beri :మరోవైపు సోనియాగాంధీతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి నీతి ఆయోగ్ వైస్ ఛైర్మ‌న్ సుమ‌న్ భేరీని కలిశారు. కేంద్ర ప్ర‌భుత్వం నుంచి తెలంగాణ‌కు రావ‌ల్సిన గ్రాంటు రూ.1800 కోట్లు వెంట‌నే విడుద‌ల‌య్యేలా స‌హ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. హైద‌రాబాద్‌లో మూసీ న‌ది రివ‌ర్ ఫ్రంట్ అభివృద్ధికి అవ‌స‌ర‌మైన నిధులు ఇప్పించాల‌ని సీఎం కోరారు. ఇందుకు అవ‌స‌ర‌మైన ప్రపంచ‌బ్యాంకు ఎయిడ్ విడుద‌ల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో తాగు నీటి స‌ర‌ఫ‌రాకు అవ‌స‌ర‌మైన నిధులతో పాటు రాష్ట్రంలో త‌మ ప్ర‌భుత్వం వైద్య‌,ఆరోగ్య‌, విద్యా రంగాల్లో తీసుకురానున్న సంస్క‌ర‌ణ‌ల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని నీతీఆయోగ్ వైస్ ఛైర్మ‌న్‌కు ముఖ్య‌మంత్రి విజ్ఙ‌ప్తి చేశారు.

ప్రాజెక్టులు, నీటి కేటాయింపులపై అసెంబ్లీలో చర్చకు మేం సిద్ధం - కేసీఆర్​ సిద్ధమా?: సీఎం రేవంత్​ రెడ్డి

రాష్ట్ర గీతంగా జయ జయహే తెలంగాణ, TGగా TS - ప్రజల ఆకాంక్షల మేరకే : సీఎం రేవంత్ రెడ్డి

Last Updated : Feb 5, 2024, 11:02 PM IST

ABOUT THE AUTHOR

...view details