'కేంద్రంతో బేషజాలకు వెళ్లం - అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హైదరాబాద్ అభివృద్ధి' CM Revanth Reddy Bhumi Pooja for Elevated Corridor Construction : హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిందే కాంగ్రెస్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ దూర దృష్టి నిర్ణయాల వల్లే భాగ్యనగరం అభివృద్ధి చెందిందని తెలిపారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్ సెల్ఫీలు దిగే శిల్పారామాన్ని ఏర్పాటు చేసింది కూడా కాంగ్రెస్సేనని అన్నారు. సికింద్రాబాద్‌లోని అల్వాల్ టిమ్స్ సమీపంలో రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సీఎం భూమి పూజ చేశారు. 11 కి.మీ పొడవు, 6 లేన్లతో రానున్న ఈ భారీ ఎలివేటేడ్ కారిడార్‌ను రూ.2,232 కోట్లతో నిర్మాణం చేపట్టనున్నారు.
క్యా సీన్ హై! - ఎయిర్‌పోర్ట్‌లో మోదీ, రేవంత్‌ల మధ్య సరదా సంభాషణ
భూమి పూజ అనంతరం మాట్లాడిన రేవంత్‌రెడ్డి గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌లో గంజాయి, పబ్బులు, డ్రగ్స్ వచ్చాయని ఆరోపించారు. కేసీఆర్ సర్కార్‌లో అభివృద్ధి జరిగింది ఏమీ లేదన్న ఆయన, గత ప్రభుత్వం ప్రజల అవసరాలను మర్చిపోయిందని దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంతో బేషజాలకు వెళ్లమని సీఎం రేవంత్ పునరుద్ఘాటించారు.
ఎన్నికలప్పుడే రాజకీయాలు : హైదరాబాద్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామని రేవంత్ పేర్కొన్నారు. రెండో దశలో 75 కి.మీ మెట్రో విస్తరణ చేపట్టబోతున్నామని వివరించారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు చేస్తామని, ఎన్నికలయ్యాక రాష్ట్ర అభివృద్దే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం ధర్నాచౌక్‌లో బీఆర్ఎస్ ధర్నా చేపట్టాలని, ఆ ధర్నాకు కాంగ్రెస్ పూర్తిగా సహకరిస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంతో గిల్లికజ్జాలు పెట్టుకుని ప్రజల సమస్యలను పక్కన పెట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం కృషి చేశామన్నారు. చాంద్రాయణగుట్ట రక్షణ భూముల విషయంలో లీజ్ రెన్యువల్ చేయకుండా, గత ప్రభుత్వం కేంద్రంతో సఖ్యత పాటించలేదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించామన్నారు. రక్షణ శాఖకు ఇవ్వవలసిన భూములను ఇచ్చామని, రాజకీయాలకు తావు లేకుండా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.
నేను గదిలో ప్రధానికి వినతిపత్రం ఇవ్వలేదు - నిండు సభలో అడిగాను : సీఎం రేవంత్
'కేంద్రంతో గత ప్రభుత్వ వివాదం వల్ల ఈ ప్రాజెక్టును పక్కనబెట్టారు. రాజీవ్ ఎలివేటెడ్ కారిడార్ ప్రాధాన్యతను కేంద్రానికి వివరించాం. ఎంపీగా ఉన్న సమయంలో రాజీవ్ ఎలివేటెడ్ కారిడార్ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లా. రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణాత్మక వైఖరి ఉంటే ప్రజలకే నష్టం. మేడ్చల్ అభివృద్ధి చెందాలంటే రాజీవ్ ఎలివేటెడ్ కారిడార్ పూర్తవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం రక్షణ శాఖ భూములను అప్పగించింది. ఉత్తర తెలంగాణ అభివృద్ధి జరగాలంటే రాజీవ్ ఎలివేటెడ్ కారిడార్ పూర్తవ్వాలి.' - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రిరాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులను కలిసి ఎదుర్కోవాలని రైతులకు సీఎం పిలుపు