తెలంగాణ

telangana

ETV Bharat / politics

త్వరలో రాష్ట్రంలో కులగణన చేపడతాం : సీఎం రేవంత్ - తెలంగాణలో త్వరలో కుల గణన

CM Revanth Reddy Announce Caste Census : రాష్ట్రంలో త్వరలోనే కులగణన చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇవాళ సచివాలయంలో బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖల బడ్జెట్‌ ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్‌, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాలు ఒకే చోట ఉండేలా అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక సమీకృత హబ్​గా నిర్మించాలని ప్రతిపాదించారు. మహాత్మ జ్యోతిబాపూలే ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకంలో ఎక్కువ మంది విద్యార్థులకు లబ్ధిచెందేలా ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశించారు.

CM Revanth Review on BC and Minority Department
CM Revanth Reddy Announce Caste Census

By ETV Bharat Telangana Team

Published : Jan 27, 2024, 9:50 PM IST

CM Revanth Reddy Announce Caste Census :సచివాలయంలో బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖల బడ్జెట్‌ ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో త్వరలో కులగణన చేయనున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఎన్నికల హామీల అమలులో భాగంగా కులగణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సచివాలయంలో బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాన్ని వేర్వేరు ప్రాంతాల్లో కాకుండా, ఒకే చోట ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. అన్ని గురుకులాలు ఒకే చోట ఉండేలా అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్(Integrated Education Hub) ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనివల్ల గురుకులాల నిర్వహణ, పర్యవేక్షణ, అజమాయిషీ మరింత మెరుగవుతుందని సీఎం పేర్కొన్నారు.

CM Revanth Review on BC and Minority Department : ఎక్కువ మంది విద్యార్థులు ఒకే ప్రాంగణంలో చదవడం వల్ల వారిలో ప్రతిభా పాటవాలు, పోటీతత్వం పెరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఎడ్యుకేషన్ హబ్​ల నిర్మాణానికి అవసరమైన స్థలాలను వెంటనే గుర్తించాలని, నియోజకవర్గ కేంద్రంలో వీలు కాకపోతే అదే సెగ్మెంటులోని మరో పట్టణం లేదా మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని సూచించారు.

అవును నేను మేస్త్రీనే- తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రీని: సీఎం రేవంత్‌రెడ్డి

ఇప్పటికే 20 ఎకరాలకు పైగా విస్తీర్ణమున్న గురుకులాల్లో మిగతా భవనాలను నిర్మించి హబ్​గా తీర్చిదిద్దాలన్నారు. ఎడ్యుకేషన్ హబ్​ల నిర్మాణానికి కార్పొరేట్ సంస్థల(Corporate Bodies) సహకారం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఎడ్యుకేషన్ హబ్ భవనాల నిర్మాణం కోసం సీఎస్ఆర్ నిధులను సమీకరించడంతో పాటు, దాతల నుంచి విరాళాలు స్వీకరించాలని ముఖ్యమంత్రి తెలిపారు.

గ్రీన్‌ఛానల్ ద్వారా డైట్, కాస్మోటిక్ ఛార్జీల చెల్లింపు :అద్దె భవనాల్లో ఉన్న గురుకులాలకు, యుద్ధ ప్రాతిపదికన సొంత భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ ఛార్జీలు, వంట బిల్లులు పెండింగ్ లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. సంక్షేమ హాస్టళ్లలో(Welfare Hostels) మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు ఇచ్చే దుప్పట్లు, నోట్ బుక్స్, యూనిఫామ్స్, పుస్తకాలకు కూడా సీఎస్ఆర్ ద్వారా నిధులు సమీకరించాలని సూచించారు.

Telangana Govt Conduct Caste Census : ప్రతీ పార్లమెంటు నియోజకవర్గానికి ఒక బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసేలా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. మహాత్మ జ్యోతిభాపూలే(Mahatma Jyotiba Phule) ఓవర్ సీస్ స్కాలర్ షిప్ స్కీమ్​ను మరింత సమర్థంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ఎక్కువ మంది అర్హులకు మేలు జరిగేలా చూడాలని తెలిపారు. ర్యాంకింగ్​ల ఆధారంగా టాప్ విదేశీ యూనివర్సిటీలకు వెళ్లే విద్యార్థులకు మొదటి ప్రాధాన్యమివ్వాలని సూచించారు.

సీఎం రేవంత్​రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వెంకటేశ్​

నారాయణపేట- కొడంగల్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు పూర్తి చేయాలి - అధికారులకు సీఎం ఆదేశం

ABOUT THE AUTHOR

...view details