CM Jagan Met With YSRCP Leaders:వైసీపీలో నియోజకవర్గాల్లోని ఇన్ఛార్జ్ల మార్పుల ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలను తప్పిస్తోన్న జగన్ మరికొందరిపైనా వేటు వేసేందుకు సిద్ధమయ్యారు. దీనికోసం గడిచిన గత కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్నారు. తమ టికెట్ చించొద్దని పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు తాడేపల్లికి వచ్చి విన్నవించుకుంటున్నారు. తమకే అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరుతున్నారు. ఎంత మందిపై వేటు పడుతుందోనని సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు.
రేపో ఎల్లుండో వైసీపీ ఐదో జాబితా - టికెట్ ఉంటుందో ఊడుతుందో తెలియక నేతల టెన్షన్
Change of Incharges in YSRCP:సీఎం జగన్ ఇప్పటికే 4 జాబితాల్లో 59 అసెంబ్లీ స్థానాలు, 9 ఎంపీ స్థానాల్లో ఇన్ఛార్జీలను మార్చేశారు. మరికొన్ని కీలక స్థానాల్లోనూ ప్రస్తుతం ఉన్న వారిని తీసివేసేందుకు కసరత్తు చేస్తున్నారు. పార్లమెంట్, అసెంబ్లీ ఇన్ఛార్జీలు మార్పులతో అయిదో జాబితా సీఎం జగన్ రూపొందిస్తున్నారు. తాడేపల్లిలోని నుంచి పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నేతలకు పిలుపు వచ్చింది.
పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ ఇన్ఛార్జీల మార్పు నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు, నేతలకు సీఎంవో నుంచి పిలుపు రావడంతో తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధనరెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి , బాపట్ల ఎంపీ నందిగం సురేష్ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధ, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్, వినుకొండ ఎమ్మెల్యే బోళ్ల బ్రహ్మనాయుడు సీఎంవోకి వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ్ రెడ్డిని కలిసి తమ సీట్లపై చర్చించారు.