ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

'విద్యుత్​ రంగంపై 1,29,503 కోట్ల నష్టం'- రూ.500, 200 నోట్లను కూడా రద్దు చేయాలి : చంద్రబాబు - white paper on power sector - WHITE PAPER ON POWER SECTOR

white paper on power sector : ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణల వల్ల 2004లో తాను అధికారం కోల్పోయినా దేశం బాగుపడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విద్యుత్‌ రంగంపై సచివాలయంలో శ్వేతపత్రం విడుదల సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ఐదేళ్ల ఏలుబడిలో విద్యుత్ రంగం పూర్తిగా నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు.

white_paper_on_power_sector
white_paper_on_power_sector (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 9, 2024, 5:08 PM IST

Updated : Jul 9, 2024, 6:59 PM IST

white paper on power sector : "ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలని పిలుపునిచ్చాం.. ప్రజలు గెలిచి మమ్మల్ని గొప్ప స్థానంలో నిలబెట్టారు. కానీ, అన్ని శాఖల్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అందుకే శ్వేతపత్రాల ద్వారా ప్రజలందరికీ వాస్తవాలు చెబుతున్నాం.. సమర్థమైన పాలన వల్లే పేదలకు మెరుగైన ప్రయోజనాలు అందుతాయని, బాధ్యత లేని పరిపాలన వల్ల అనేక కష్టాలు ఎదురవుతాయి" చంద్రబాబు అన్నారు. డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించాలని బ్యాంకర్లకు చెప్పామన్న చంద్రబాబు రూ.500, 200 నోట్లు కూడా రద్దు చేయాలని కోరుతున్నాం అని అన్నారు.

వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్ర భవిష్యత్ ను దారుణంగా దెబ్బ తీశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెరుగైన పాలన ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యం అవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని పలు అంశాలు పరిశీలిస్తే చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని, ఏ అంశాలు ఎలా ధ్వంసం అయ్యాయో తవ్వే కొద్ది వెలుగు చూస్తున్నాయని ధ్వజమెత్తారు. అన్ని శాఖల్లో నూ ఇదే పరిస్థితి ఉందని మండిపడ్డారు. అందుకే రాష్ట్రానికి బాధ్యతా యుతమైన నాయకుడు ఉండాలి.. దీనిపై ఆలోచించమని ప్రజలకు చెబుతున్నామన్నారు.

విద్యుత్​ రంగంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ సందర్భంగా రిమోట్‌ మొరాయించడంపై చంద్రబాబు ఛలోక్తులు విసిరారు. పనిచేయకపోవడం వైఎస్సార్సీపీ ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిందని, సరి చూసుకోవాలని అధికారులకు చురకలు వేశారు. జగన్ దుర్మార్గానికి పోలవరం హైడల్‌ ప్రాజెక్టులోనే 4వేల 773 కోట్ల రూపాయల మేర రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఏపీ బెవేరేజస్ కార్పొరేషన్ బాండ్లలో ఏపీ జెన్ కో, ట్రాన్స్కో లు పెట్టుబడులు పెట్టాయంటే జగన్ ప్రభుత్వం ఎలాంటి దుష్ట ఆలోచనలు చేసిందో అర్థం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ అహంకారం వల్ల ఒక్క పోలవరం ప్రాజెక్టు లోనే 4773 కోట్ల రూపాయలు మేర ప్రభుత్వం పై అదనపు భారం పడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. సెకి నుంచి కొనుగోలు చేయాల్సిన 7 వేల మెగావాట్ల వల్ల ఒక్క ట్రాన్స్మిషన్ కోసమే 3850-4350 కోట్లు అదనం గా చెల్లింపులు చేయాల్సి ఉంటుందన్నారు. ఇలాగే 25 ఏళ్లు చెల్లింపులు చేస్తే 62 వేల కోట్ల రూపాయల మేర భారం ప్రభుత్వం పై పడుతుందని వెల్లడించారు. గత ప్రభుత్వం చేతగాని తనం వల్ల ఊహించని కోణాల్లో ను విద్యుత్ సంస్థలు కు నష్టాలు వస్తున్నాయని విమర్శించారు. ఏపీ బెవేరేజస్ కార్పొరేషన్ బాండ్లు లోనూ ఏపి జెన్ కో , ట్రాన్స్ కో లు పెట్టుబడులు పెట్టాయి అంటే జగన్ ప్రభుత్వం ఎలాంటి దుష్ట ఆలోచనలు చేసిందో అర్థం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల వారత్వంగా ఎన్డీఏ ప్రభుత్వానికి 1.29 లక్షల కోట్ల నష్టాలు అందాయని వివరించారు.

ఈ నష్టాలు తగ్గించడం, ఆయా సంస్థలు ను పునర్నిర్మించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం వ్యవస్థని గాడిలో పెట్టడం సహా ప్రజలకు భారం లేకుండా చూడాలన్నారు. దీనిపై ప్రజల నుంచి కూడా ఆలోచనలు తీసుకుంటామని వెల్లడించారు. అత్యంత కీలకమైన రంగం కాబట్టే శ్వేత పత్రం విడుదల చేశామన్నారు. మొత్తం కేంద్రాన్ని ఆదుకోవాలని చెబితే వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదని, ఏపీ నే సొంత గా వనరులు సమకూర్చుకోవాలని చెప్పారు. విద్యుత్ వినియోగదారుల కు అంతరాయం లేకుండా ఇవ్వాలని అదేశించారు. కరెంటు కోతలు లేకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. నాణ్యమైన కరెంటు ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. స్మార్ట్ మీటర్ ల విషయం లో త్వరలో నిర్ణయం తీసుకుంటామని, అక్కడ సోలార్ పెట్టేలా చర్యలు చేపడతామని చెప్పారు. ఎమోషనల్ నిర్ణయాలు ఏవీ తీసుకోనన్నారు. గ్రీన్ హైడ్రోజెన్ లాంటి నూతన సాంకేతికత ను అందిపుచుకుంటే కొన్ని సమస్యలు అధిగమించే అవకాశం ఉందని వివరించారు. ఏపీ, ఎంపీ, గుజరాత్​ను గ్రీన్ హైడ్రోజెన్ జోన్ గా కేంద్రం ఎంపిక చేసిందని తెలిపారు.

రూ.5.4 లక్షల కోట్లతో రుణ ప్రణాళిక - ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో కీలక నిర్ణయాలు - SLBC meeting Chaired by Chandrababu

రాజకీయం ముసుగులో లూటీ చేసిన వ్యక్తులు ఇప్పుడు ఇష్టానుసారం గా మాట్లాడుతున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. రాజకీయ ముసుగులో బెదిరింపులు చేస్తే భయపడేది లేదని హెచ్చరించారు. నేరస్థులు, అవినీతి పరులు తప్పించుకోలేరని తెలిపారు. అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారని దుయ్యబట్టారు. ఉచిత ఇసుక ఇస్తామని చెప్పాం ఇప్పుడు అమలు చేస్తున్నామన్నారు. దీన్ని కూడా కొందరు రాజకీయం చేసి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతి అక్రమాల పై చట్ట ప్రకారం వ్యవహరిస్తామన్నారు. రాష్ట్రంలో ఓ భూతాన్ని రాజకీయం గా భూ స్థాపితం చేస్తామన్నారు. విచారణలు, ఎంక్వయరీ లు అంటే పెట్టుబడి దారులు భయపడి ఎవరూ రారని ఆవేదన వ్యక్తంచేశారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ఇప్పటికే ఆయా సంస్థలు ఎవరూ పెట్టుబడులకు ముందు కు రాలేదన్నారు. రాష్ట్రం లో నిధుల లోటు ఉందని, అయినా ఇసుక ఉచితం గానే ఇస్తున్నామన్నారు. అక్రమాలు చేస్తే కఠినం గా వ్యవహరిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. అప్పుల వాళ్ళు రోజూ తిరుగుతున్నరన్నారు. పెండింగ్ లో ఉన్న కొన్ని బిల్లులు క్లియర్ చేయాల్సి ఉందన్నారు.

విద్యుత్ ఎప్పుడూ అభివృద్ధి కి సూచికేనని, 1995 - 2004 లో మొదటి విద్యుత్ సంస్కరణలు తెచ్చామని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. 2019-24 లో మధ్య గత ప్రభుత్వ హయంలో 1,29 లక్షల కోట్ల అప్పులు విద్యుత్ సంస్థలుపై తెచ్చారని మండిపడ్డారు. 2019-24 మధ్య విద్యుత్ టారిఫ్ కూడా పెరిగింది, ప్రజల పై భారం మోపారని దుయ్యబట్టారు. విద్యుత్ సంస్థలు నష్టం చూశాయని వాపోయారు. 1995-2004 మధ్య విద్యుత్ సంస్కరణల్లో భాగంగా విద్యుత్ నియంత్రణ మండలి దేశంలోనే ఏర్పాటు అయ్యిందని, విద్యుత్ సంస్కరణల వల్ల అప్పట్లో తమ ప్రభుత్వం ఓడి పోయినా విద్యుత్ సంస్కరణలు గెలిచాయని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రానికి విద్యుత్ మిగులు కూడా వచ్చిందన్నారు. 2014 నుంచి లో విద్యుత్ ఉత్పత్తి 9453 మెగా వాట్ల మేర పెంచామని, తలసరి వినియోగం ఏపీలో 1234 యూనిట్లకు పెరిగిందన్నారు. 2018 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీ ఎదిగిందన్నారు. మొత్తంగా 2018-19 నాటికి 14,929 మెగావాట్ల ఉత్పత్తికి చేరేలా కృషి చేశామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

వైఎస్సార్సీపీ భూఅక్రమాలపై పూర్తి వివరాలివ్వండి - అధికారులకు చంద్రబాబు ఆదేశం - White Paper on YSRCP Land Grabs

2019 -24 మధ్య గత ప్రభుత్వ హయాంలో ప్రజలపై 32,166 కోట్ల రూపాయల మేర భారం మోపారని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. విద్యుత్ సంస్థల పై 49,596 కోట్ల మేర అప్పులు తెచ్చారన్నారు. పాలనా పరమైన కారణాల వల్ల విద్యుత్ రంగం ఎదుర్కొన్న నష్టాల విలువ 47, 741 కోట్ల రూపాయలు గా ఉందని తెలిపారు. మొత్తంగా ప్రజల పైనా, ప్రభుత్వానికి 1,29,503 కోట్ల రూపాయల మేర నష్టం జరిగిందని వెల్లడించారు. అసమర్థ పాలన వల్ల రాష్ట్రానికి, ప్రజలకు జరిగిన నష్టం ఇదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో పెట్టుబడులు కూడా రాకుండా పోయాయని విమర్శించారు. సౌర విద్యుత్ పీపీఏ లను రద్దు చేస్తూ తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల రాష్ట్రం నష్ట పోయిందన్నారు. కొన్ని సార్లు ఉత్పత్తి నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయాలు కూడా ప్రజల పై భారం మోపాయని వివరించారు.

ట్రూ అప్, ఇంధన సర్చార్జి, ఎలక్ట్రిసిటీ డ్యూటీ అని రకరకాలగా గత ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసిందని మండిపడ్డారు. టారిఫ్ ద్వారా 16,699 కోట్లు, ట్రూ అప్ ద్వారా 5886 కోట్లు, ఇంధన చార్జీ లు గా 3977 కోట్లు, ఎలక్రిసిటీ డ్యూటీ పేరిట 5607 కోట్లు మేర గత ప్రభుత్వం వసూలు చేసిందన్నారు. పెత్తం దారి జగన్ చేసిన దారుణానికి పేద ప్రజలు నష్ట పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో విద్యుత్ సంస్థల అప్పు 79 శాతం మేర పెరిగిందన్నారు. వివిధ కారణాల వల్ల ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీ మొత్తలు, తెలంగాణ నుంచి రావాల్సిన మొత్తం అన్ని కలిపి 52,091 కోట్లుగా ఉన్నాయని వెల్లడించారు. గత ప్రభుత్వం చేతగాని తనం వల్ల అసమర్థ పాలన వల్ల విద్యుత్ రంగానికి ఏర్పడిన నష్టాలు 47,741 కోట్లకు చేరాయని విమర్శించారు.

నేడు సచివాలయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం - White Paper on Power Sector Today

Last Updated : Jul 9, 2024, 6:59 PM IST

ABOUT THE AUTHOR

...view details