CM Chandrababu on Performance of Ministers:మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయి. మంత్రుల పనితీరును సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. వంద రోజుల తర్వాత మంత్రులకు ప్రొగ్రెస్ రిపోర్ట్ ఇస్తానన్నారు. జనసేన మంత్రుల రిపోర్టును పవన్ కల్యాణ్‌కు అందిస్తామని సీఎం తెలిపారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు వివాదాస్పదంగా వ్యవహరించడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. కొందరి తప్పిదాలతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యుల ప్రవర్తన మితీమీరకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలదేనని స్పష్టం చేశారు.
ఒకరిద్దరు తీరుతో ప్రభుత్వం చేసే మంచి పక్కకుపోయి, నేతల తీరే హైలెట్ అవుతోందని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. మాయ చేయడానికే గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ విధానం ప్రవేశ పెట్టిందని మంత్రులు అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వంలో సుమారు 40 ప్రాజెక్టులకు సింగిల్ టెండర్ పడిందని రివర్స్ టెండరింగ్‌కు అర్థం ఏముందని అన్నారు. సీవీసీ గైడ్ లైన్స్ ప్రకారం టెండర్ల ప్రక్రియ జరిపించాలని మంత్రులు సూచించారు. తాను చేసిన తప్పులకు ఓ జడ్జితో ఆమోదముద్ర వేయించుకోవడానికే జగన్ జ్యుడిషియల్ ప్రివ్యూను తీసుకొచ్చారని అన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ వ్యవస్థ రద్దు చేసేలా చూడాలని కోరారు.
దేవాదాయశాఖ అర్చకులకు ఇక నుంచి రూ. 15 వేల వేతనం-సీఎం చంద్రబాబు - CBN Review on Endowments Department