CM Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయానికి వెళ్తూ తన ఇంటి వద్ద సమస్యలతో వచ్చిన ప్రజల్ని చూసి రోడ్డుమీద కాన్వాయ్ ఆపారు. అందరినీ ఆప్యాయంగా పలకరించిన ఆయన, యోగక్షేమాలు అడిగి తెలుసుకుని వినతులు స్వీకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ప్రజల పట్ల సహృదయత చాటుకున్నారు. ఉండవల్లి నివాసం నుంచి సచివాలయానికి వెళ్తుండగా సమస్యలు చెప్పుకొనేందుకు వచ్చిన ప్రజల్ని చూసి రోడ్డుపై కాన్వాయ్ ఆపారు. ప్రజల సమస్యలు ఆలకించారు. మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ భార్య ఇచ్చావతితోపాటు కుమారుడిని ఆప్యాయంగా పలకరించారు. కుమారుడు చదువు విషయాన్ని ఆమె ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బాలుడి చదువు బాధ్యత తాము తీసుకుంటామని, ధైర్యంగా ఉండాలని చంద్రబాబు హామీ ఇచ్చారు. మరికొందరు తమ సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వగా పరిష్కరిస్తామని సీఎం చెప్పారు.
విశాఖను సింగపూర్ చేద్దాం - యువతకు అవకాశాలు కల్పిద్దాం: చంద్రబాబు - CII National Council meeting
మాజీ ఎమ్మెల్యే సివిరి సోము భార్య సీఎం చంద్రబాబుని కలిశారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే సివిరి సోము నక్సల్స్ చేతిలో హతమయ్యారు. సోము భార్య ఇచ్చావతి యోగక్షేమాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. కుమారుడు చదువు విషయం ఆమె ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సోము కొడుకు చదువు బాధ్యత తాను తీసుకుంటానని ధైర్యంగా ఉండాలని చంద్రబాబు హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ గూండాల దాడిలో సర్వస్వం కోల్పోయానని అరకు లోయ సర్పంచ్ శ్రీనివాస్ చంద్రబాబుకి వివరించారు. సమస్య పరిష్కారానికి సీఎం హామీ ఇచ్చారు.