Chandrababu's tribute to Ramoji Rao : టీడీపీ అధినేత చంద్రబాబు-భువనేశ్వరి దంపతులు రామోజీ ఫిలిం సిటీలో రామోజీరావు పార్థివదేహానికి నివాళులు అర్పించారు. దిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఫిలింసిటీకి చేరుకున్నారు. రామోజీరావు కుటుంబసభ్యులను చంద్రబాబు, భువనేశ్వరి పరామర్శించారు. రామోజీరావు కుటుంబసభ్యులను చంద్రబాబు ఓదార్చారు.
మహోన్నత శిఖరాలకు 'మార్గదర్శి'- చిట్‌ఫండ్ వ్యాపారంలో దేశంలోనే నెంబర్‌వన్ - Margadarshi Chitfunds
తెలుగు ప్రజల గుండెల్లో రామోజీరావు చిరస్థాయిగా ఉంటారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. మార్గదర్శి, ఈనాడు, ఈటీవీ, ఫిలింసిటీ సహా అనే వ్యవస్థల నిర్మాణంతో తెలుగుజాతికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. అలాంటి మహాయోధుడి మరణం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. రామోజీరావు పార్థివదేహానికి భార్య భువనేశ్వరితో కలిసి చంద్రబాబు నివాళులు అర్పించారు. భౌతికకాయంపై పూలమాలలు వేసి అంజలి ఘటించారు. రామోజీరావు కుటుంబసభ్యులను పేరుపేరునా పలకరించారు. అందరినీ పరామర్శించారు. అంతులేని ఆవేదనలో ఉన్నవారిని ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పారు.
రామోజీరావు పార్ధివదేహానికి చంద్రబాబు నివాళి (ETV Bharat) రైతుబిడ్డగా మొదలై మీడియా మహాసామ్రాజాన్ని నిర్మించిన యోధుడు రామోజీ రావు - Ramoji Rao Biography
రామోజీరావు మరణం చాలా బాధాకరమన్న చంద్రబాబు ఆ వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. సమాజహితం కోసమే అనునిత్యం కష్టపడ్డారని, తెలుగుజాతి కోసం అహర్నిశలు పనిచేశారని తెలిపారు. రామోజీరావు ఒక వ్యక్తి కాదు, వ్యవస్థ అని కొనియాడారు. చిత్రపరిశ్రమకు ఎనలేని సేవలు చేశారన్న చంద్రబాబు ధర్మం ప్రకారం పనిచేస్తానని రామోజీరావు స్పష్టంగా చెప్పేవారని గుర్తుచేసుకున్నారు. రామోజీరావు నిర్మించిన వ్యవస్థలు శాశ్వతమని, అత్యున్నత ప్రమాణాలతో రామోజీ ఫిల్మ్‌సిటీ స్థాపించారని పేర్కొన్నారు. రామోజీరావు తన జీవిత కాలంలో విశ్వసనీయత సంపాదించారని, తెలుగుజాతిని ముందుకు తీసుకెళ్లేందుకు కృషిచేశారని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ముందుకెళ్తామని చెప్తూ రామోజీరావు గ్రూపు సంస్థల సిబ్బందికి తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. రామోజీరావు ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని చంద్రబాబు తెలిపారు.
ప్రపంచాన్నే అబ్బురపరిచిన చిత్రనగరి - ఫిలిం సిటీని సృష్టించిన దార్శనికుడు రామోజీ - Ramoji Film City History
రామోజీరావు అస్తమయంపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు తెలుగు వెలుగు ఆయన మృతి తీరని లోటన్నారు. సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించారన్నారు. రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అక్షర యోధుడుగా పేరున్న రామోజీరావు సేవలు ఎనలేనివని పేర్కొన్నారు. అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని భావించానని ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్రవేసిన రామోజీ తెలుగు ప్రజల ఆస్తి, ఆయన మరణం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా తీరని లోటని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
లోకేష్ దంపతులు రామోజీరావు పార్థివదేహానికి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో పాటుగా ఆయన సతీమణి బ్రాహ్మణి నివాళులర్పించారు. రామోజీరావు భౌతికకాయంపై పూలమాలలు వేసి అంజలి ఘటించారు. రామోజీరావు కుటుంబసభ్యులను పరామర్శించారు. అంతులేని ఆవేదనలో ఉన్నవారిని ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పె ప్రయత్నం చేశారు.
రామోజీరావు పార్థివదేహానికి నివాళులర్పించిన లోకేష్ దంపతులు (ETV Bharat) ఆతిథ్యరంగ సంస్థల్లో ప్రముఖ స్థాయిలో డాల్ఫిన్ హోటళ్లు - Ramoji Dolphin Hotels