ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

చంద్రబాబు ప్రజాగళం రెండో విడత - రేపటి నుంచే ప్రారంభం - Chandrababu Praja Galam - CHANDRABABU PRAJA GALAM

Chandrababu Praja Galam Second Phase: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజాగళం మొదటి విడత విడత విజయవంతంగా ముగిసింది. వివిధ ప్రకటనలు చేస్తూ ప్రజలకు భరోసా కల్పించారు. రేపటి నుంచి ప్రజాగళం రెండో విడత చేపట్టనున్నారు.

Chandrababu_Praja_Galam_Second_Phase
Chandrababu_Praja_Galam_Second_Phase

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 2, 2024, 11:36 AM IST

Chandrababu Praja Galam Second Phase : పొత్తుల ఖరారు, సీట్ల పంపకం, అభ్యర్థుల ఎంపికతో తీరిక లేకుండా గడిపిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బాబు 15 నియోజకవర్గాల్లో ప్రజాగళం రోడ్‌షోలలో పాల్గొన్నారు. ప్రజాగళం రెండో విడతలో భాగంగా మరోసారి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టనున్నారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో ప్రచార వేగం పెంచారు. ప్రజాగళం పేరిట రోజుకు రెండు నుంచి మూడు నియోజకవర్గాలు చుట్టి వచ్చేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. సూపర్‌ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే గాకా ప్రజాకర్షణ పథకాలను ప్రకటించనున్నారు.

రేపటి నుంచే ప్రారంభం :తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం రెండో విడత పర్యటనలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఆ పార్టీషెడ్యూల్‌ ప్రకటించారు. బుధవారం నుంచి ఆయన రెండో విడత ప్రజాగళం పర్యటనలు చేపట్టనున్నారు. బుధవారం నుంచి 5 రోజులపాటు జరిగే ప్రజాగళం షెడ్యూల్‌ ఖరారైంది. 3వ తేదీన కొత్తపేట, రామచంద్రాపురం, 4వ తేదీన కొవ్వూరు, గోపాలపురంలో చంద్రబాబు రోడ్‌షో నిర్వహించనున్నారు. 5వ తేదీన నరసాపురం, పాలకొల్లు, 6వ తేదీన పెదకూరపాడు, సత్తెనపల్లి, 7వ తేదీన పామర్రు, పెనమలూరులో ప్రజాగళం కార్యక్రమం నిర్వహించనున్నారు. రోజూ సాయంత్రం 4 గంటలకు తొలి సమావేశం, 6 గంటలకు రెండో సమావేశం జరిపేలా ప్రణాళిక రూపొందించారు. తొలి విడత 15 నియోజకవర్గాల్లో ప్రజాగళం రోడ్‌షోలలో చంద్రబాబు పాల్గొన్నారు.

జగన్‌కు ఓటు వేస్తే మన నెత్తిన మనమే చెత్త వేసుకున్నట్లు: చంద్రబాబు - chandrababu praja galam yatra

TDP Chief Chandrababu Fire on CM Jagan : సీఎం జగన్‌ నమ్మించి గొంతు కోసే రకమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. బాబాయ్‌ని చంపించిన వారికి ఎంపీ సీటు కట్టబెట్టి, బాధితులనే ఇబ్బంది పెడుతున్న సీఎం ఫేక్‌ ఫెలో అంటూ దుయ్యబట్టారు. ఐదేళ్లు కేంద్రంలో అన్ని బిల్లులకూ వైసీపీ సహకరించిందన్న చంద్రబాబు ఎన్టీయే అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు పోతాయంటూ రెచ్చగొడుతోందని బాపట్ల ప్రజాగళం సభలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ, జనసేన, బీజేపీ కలయిక రాష్ట్రం కోసమే తప్ప, స్వలాభం కోసం కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఇంటికెళ్లడం ఖాయమన్న చంద్రబాబు కూటమిది ఏకపక్ష విజయమని ధీమా వ్యక్తం చేశారు. రైతుకు కష్టం వస్తే ఆదుకోలేని ముఖ్యమంత్రి వ్యవసాయం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని బాపట్ల ప్రజాగళం సభలో చంద్రబాబు దుయ్యబట్టారు. అన్నదాతలను ఆదుకుని పరిహారం చెల్లించటంలో వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందన్నారు.

సీఎంగా 14 ఏళ్లలో 8 డీఎస్సీలు - అధికారంలోకి రాగానే మరోసారి మెగా డీఎస్సీ : చంద్రబాబు - Chandrababu Open Challenge

రైతులు నష్టపోకూడదని పట్టిసీమ కడితే సీఎం జగన్‌ అక్కసుతో ఆ ప్రాజెక్టు ద్వారా నీళ్లు రాకండా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. జీవనాడిలాంటి పోలవరం ప్రాజెక్టును జగన్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలు అంటూనే వారికి అందాల్సిన పథకాల్ని రద్దు చేసి నిలువునా దగా చేశారని చంద్రబాబు మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బడుగు బలహీన వర్గాలపై వైసీపీ పాలనలో దాడులు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మద్యపాన నిషేధం చేస్తానన్న జగన్‌ నాసిరకం మద్యం తీసుకొచ్చి ఎంతో మంది ఆడబిడ్డల ఉసురుపోసుకున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రానికి తానే సేఫ్‌ డ్రైవర్‌నన్న చంద్రబాబు దారి తప్పిన ఏపీని మరలా గాడిలో పెడతానన్నారు.

తండ్రి లేని బిడ్డను అన్నావు-చిన్నాన్నను చంపేశావు! సీమకు సాక్షికి ఇచ్చినంత కూడా ఇవ్వలేదు: చంద్రబాబు - Chandrababu criticized YCP

ABOUT THE AUTHOR

...view details