Chandrababu Naidu Election Campaign :ఐదేళ్ల వైఎస్సార్సీపీ నరకపాలనకు చెక్ పెట్టే సమయం ఆసన్నమైందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలోని అంబాజీపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. అధికారంలోకి రాగానే బీసీల రక్షణకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామన్న చంద్రబాబు ప్రజాగళంకు వస్తున్న స్పందన చూస్తుంటే ఎన్నికలు లాంఛనమేనని, కూటమిదే గెలుపని విశ్వాసం వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే అని స్పష్టం చేశారు.
రంజాన్ రోజున ముస్లిం మహిళలను జగన్ కంటతడి పెట్టించారు : చంద్రబాబు - Muslim Women Meet Chandrababu
మూడు జెండాలు వేరైనా లక్ష్యం ఒక్కటే :వైఎస్సార్సీపీ పాలనలో ఎస్సీల 27 పథకాలు రద్దు చేశారని, దుర్మార్గ పాలన వస్తే ఎస్సీలను చంపి డోర్ డెలివరీ చేస్తారని చంద్రబాబు తెలిపారు. ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల కోసం డిక్లరేషన్ తీసుకువస్తామని అన్నారు. వరికి గిట్టుబాటు ధర కల్పిస్తామని అన్నారు కొబ్బరి ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో ఏ ఒక్క కుటుంబానికి న్యాయం జరగలేదని, సిద్ధం సిద్ధం అంటున్న వారికి యద్ధం ఇద్దామని పవన్ చెప్పారని గుర్తు చేశారు. మూడు జెండాలు వేరైనా లక్ష్యం ఒక్కటేనని, సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయమని అన్నారు. రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.