TDP Second List : తెలుగుదేశం అభ్యర్థుల రెండో జాబితాను చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తొలి జాబితాలో 94 మంది అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు మలి జాబితాలో 34మందిని ఖరారు చేశారు. పొత్తుల లెక్కప్రకారం మరో 16అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
ఆశావహులు, అసంతృప్తులతో చంద్రబాబు భేటీ - రాజకీయ భవిష్యత్తుకు హామీ
తాజా జాబితాలో నరసన్నపేట బగ్గు రమణమూర్తి, గాజువాక - పల్లా శ్రీనివాసరావు, చోడవరం-కె.ఎస్.ఎన్.ఎస్. రాజు, మాడుగుల - పైలా ప్రసాద్, ప్రత్తిపాడు - వరుపుల సత్యప్రభ తదితరులున్నారు.
'ఎందుకు? ఏమిటి? ఎలా?' టీడీపీ సీనియర్లలో టెన్షన్ - బాబు నివాసం వద్ద హైడ్రామా
టీడీపీలో చేరికలు : కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. సంజీవ్ కుమార్‌కు పార్టీ కండువా కప్పి చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. పొయ్యిమీద కాలుతున్న కుండను ముట్టుకునే ప్రయత్నం చేస్తే చెయ్యి కాలుతుందని, తనతో సహా రాష్ట్ర ప్రజలు వైఎస్సార్సీపీని ఓసారి ముట్టుకుని ఆ తప్పు చేశారని కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ అన్నారు. రెండో చెయ్యి కూడా కాల్చుకోవద్దని ఆయన ప్రజల్ని కోరారు. కర్నూల్ అభివృద్ధి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే తాను తెలుగుదేశంలో చేరానని తెలిపారు. ఎలాంటి సీటు ఆశించకుండా భేషరతుగానే తెలుగుదేశంలో చేరా, తగు ప్రత్యామ్నాయం చూస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని సంజీవ్‌కుమార్ వెల్లడించారు. వైఎస్సార్సీపీ పాలనలో కంఠ శోష తప్ప ఏమీ లేదన్న ఆయన, ఆ పార్టీలో కల్పించేది ఉత్తుత్తి సామాజిక న్యాయమని విమర్శించారు. బీసీలకు వైఎస్సార్సీపీలో ఉత్సవ విగ్రహాల తరహా పదవులే తప్ప ప్రాధాన్యం లేదని ఆరోపించారు.
టీడీపీ తొలి జాబితాలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం
కర్నూలు ప్రాంతం నుంచి వలసలు, దారిద్య్రం నివారించలేకపోయాననే బాధ ఉందని అన్నారు. రెండు నదుల మధ్యలో ఉన్న కర్నూలు కు తాగు నీరుకూడా ఇవ్వలేనప్పుడు ఇక ఎంపీగా ఎందుకు అని అనిపించిందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి అపాయిట్మెంట్ కూడా వైసీపీలో దొరకటం గగనమేనని సంజీవ్‌కుమార్ విమర్శించారు. సంజీవ్ కుమార్ తోపాటు పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ ప్యాలకుర్తి రమేశ్, వెంకాయపల్లె ఆలయ చైర్మన్ బేతం కృష్ణుడు, వాల్మీకీ సంఘం నాయకులు ముండ్ల శేఖర్, తలారి కృష్ణ, ఎన్జీవో మాజీ నాయకులు కుబేర స్వామి, నరసింహులు, శాంతకుమారి తదితరులు తెలుగుదేశంలో చేరారు.
వైఎస్సార్సీపీలో ఉండి 5 లేదా 10కోట్ల రూపాయలు సమర్పించుకుంటే ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఇస్తామనే ప్రతిపాదన తన ముందు పెట్టారని కర్నూల్ ఎంపీ సంజీవ్ కుమార్ తెలిపారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన తనకు, ఎమ్మిగనూరు సిట్టింగ్ ఎమ్మెల్యే బుట్టా రేణుక మధ్య డబ్బు పోటీ పెట్టే యత్నం చేశారని ఆయన ఆరోపించారు. తన దగ్గర అంత డబ్బు లేదని గౌరవంగా చెప్పి తప్పుకున్నానన్న ఆయన, రేణుక ఎంత ఇచ్చుకుందో తనకు తెలియదని అన్నారు. బీసీల్లో బీసీలకు, ఎస్సీలో ఎస్సీలకు, బీసీలు ఎస్సీల మధ్య గొడవలు సృష్టించే విచ్ఛిన్న రాజకీయాలు వైఎస్సార్సీపీలో చూసానని సంజీవ్‌కుమార్ వ్యాఖ్యానించారు.
'వారసులొస్తున్నారు'- ఎన్నికల బరిలో గెలుపే లక్ష్యంగా ముందడుగు!
టీడీపీ అభ్యర్థుల జాబితా ఇదే
1 నరసన్నపేట బగ్గురమణమూర్తి
2 గాజువాక పల్లాశ్రీనివాసరావు
3 చోడవరం కె.ఎస్.ఎన్.ఎస్.రాజు
4 మాడుగుల పైలాప్రసాద్
5 ప్రత్తిపాడు వరుపులసత్యప్రభ
6 రామచంద్రపురం వాసంశెట్టిసుభాష్
7 రాజమండ్రిరూరల్ గోరంట్లబుచ్చయ్య చౌదరి
8 రంపచోడవరం మిర్యాలశిరీష
9 కొవ్వూరు ముప్పిడివెంకటేశ్వరరావు
10 దెందులూరు చింతమనేనిప్రభాకర్
11 గోపాలపురం మద్దిపాటివెంకటరాజు
12 పెదకూరపాడు భాష్యంప్రవీణ్