రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం - ప్రతి ఒక్కరూ సంకల్పంతో ముందుకెళ్లాలి: చంద్రబాబు Chandrababu Instructions to Candidates:రాక్షసులతో యుద్ధం చేస్తున్నందున ప్రతి ఒక్కరూ సంకల్పంతో ముందుకెళ్లాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేసాడో చెప్పుకోలేకే డ్రామాలకు తెర తీస్తున్నారని ఆయన విమర్శించారు. పెన్షన్ల విషయంలో జగన్ చేసిన కుట్రలు, ఆడిన గులకరాయి డ్రామాను ప్రజలు ఛీ కొట్టారని దుయ్యబట్టారు. ప్రజాగళానికి వస్తున్న స్పందనే జగన్ పతనాన్ని చాటి చెప్తోందని ధీమా వ్యక్తం చేశారు.
చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో పార్లమెంట్, శాసనసభకు పోటీ చేసే అభ్యర్థులకు బీఫాంలు అందించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలు పెట్టి అభ్యర్థులకు బీఫాంలు తన చేతుల మీదుగా ఇచ్చారు. అనంతరం అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు. బీఫాంలు తీసుకున్న ప్రతి అభ్యర్థీ గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని స్పష్టం చేశారు. ప్రజలు, కార్యకర్తల అభీష్టం మేరకే అభ్యర్థులు ఎంపిక చేశామన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయన్న చంద్రబాబు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలవాలన్నదే తమ నినాదమని తేల్చిచెప్పారు.
టీడీపీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేసిన చంద్రబాబు - ఐదు అసెంబ్లీ స్థానాల్లో మార్పు - B FORMS TO TDP CANDIDATES
3 పార్టీల నేతల మధ్య సమన్వయం ఉంటూనే, ఓటు బదిలీ జరగాలని దిశానిర్దేశం చేశారు. వైసీపీలో సీటు ఇస్తానన్నా తీసుకోకుండా బయటకు వచ్చిన మంచివాళ్లను మాత్రమే తీసుకుని తాను సీట్లు ఇచ్చానని స్పష్టం చేశారు. పార్టీలో కొత్తగా చేరిన వారు పార్టీ లైను ప్రకారం నడుచుకోవాలని సూచించారు. ఎన్నికలకు ఇక 22 రోజుల సమయమే, ప్రచారానికి 20 రోజులే ఉందని గుర్తు చేసిన చంద్రబాబు ఈ సమయం ఎంతో కీలకమన్నారు.
లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు చెప్పడంలో జగన్ నేర్పరని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రతిసారీ సానుభూతితో గెలవాలని చూస్తున్నాడని మండిపడ్డారు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు 43 వేల కోట్లు అక్రమంగా సంపాదించారని సీబీఐ నిర్ధారిస్తే దాన్ని నిరూపించుకోకుండా తనపై అక్రమ కేసులు పెట్టారని ప్రచారం చేసుకున్నాడని దుయ్యబట్టారు. జగన్ బస్సుయాత్రలో వాళ్లే కరెంట్ తీసేసుకున్నారు. చీకట్లో తాను దాడి చేయించానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన కొద్ది క్షణాలకే ప్లకార్డులు పట్టుకుని వచ్చి ధర్నాలు చేశారని విమర్శించారు. రాయి విసిరిన వ్యక్తితో బోండా ఉమా ప్రమేయం ఉందని చెప్పించేలా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
జగన్ సభ నిండుగుండాలంటే మందు ఫుల్లుగుండాలా!- 20 లక్షల బాటిళ్లు- మద్యం వ్యాపారం అంటే ఇదే! - LIQUOR in CM Jagan meetings
పెన్షన్ల పంపిణీకి నిధుల్లేకుండా చేసి వాలంటీర్లతో పంపిణీ చేయొద్దనడంతో పెన్షన్లు ఆగిపోయాయని విషప్రచారం చేశారని ఆరోపించారు. జగనే అందరినీ అంతం చేయడానికి ప్రయత్నిస్తూ తనను అంతం చేయడానికి వస్తున్నారని ఎదుటివారిపై బురదజల్లుతున్నారని దుయ్యబట్టారు. అమరావతి, పోలవరంను విధ్వంసం చేశాడని, రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నాడని చంద్రబాబు ధ్వజమెత్తారు. కేడర్‌తో ప్రతి అభ్యర్థీ అనుసంధానం కావాలని చంద్రబాబు సూచించారు. అన్ని వర్గాల్లో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత మళ్లీ రాష్ట్రంలో మంచి రోజులు రాబోతున్నాయని ప్రజలకు తెలియజేయాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
జగన్ సభ నిండుగుండాలంటే మందు ఫుల్లుగుండాలా!- 20 లక్షల బాటిళ్లు- మద్యం వ్యాపారం అంటే ఇదే! - LIQUOR in CM Jagan meetings