ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

కడప ఎంపీ స్థానం మనదే- 160 స్థానాల్లో కూటమి విజయం ఖాయం : చంద్రబాబు - TDP workshop - TDP WORKSHOP

TDP workshop : రౌడీయిజం, అధికార దుర్వినియోగం పెరిగిపోయిన తరుణంలో ఎన్నికల్లో కూటమి అభ్యర్థులంతా అప్రమత్తంగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు. విజయవాడలోని ఓ కన్వెన్షన్‌లో హాలులో టీడీపీ అభ్యర్థులతో నిర్వహించిన వర్క్​షాపులో గెలుపు వ్యూహంపై కీలక ప్రసంగం చేశారు. అధికారంలోకి వచ్చాక పార్టీని నమ్ముకున్న అందరికి న్యాయం చేస్తానన్న బాబు, పురందేశ్వరీ, పవన్ కల్యాణ్​ ల సమయస్పూర్తిని కొనియాడారు.

tdp_workshop_in_vijayawada
tdp_workshop_in_vijayawada

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 23, 2024, 2:41 PM IST

Updated : Mar 23, 2024, 7:15 PM IST

TDP workshop : రాష్ట్ర ప్రగతి కోసం 3పార్టీలు వేసే పునాది, 30ఏళ్ల భవిష్యత్తుకు నాంది పలకాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. విశాఖలో దొరికిన 25వేల కోట్ల డ్రగ్స్ లో రాష్ట్ర అధికారుల తీరుని సీబీఐ సైతం తప్పుబట్టిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ లాంటి పార్టీలను కట్టడి చేయాలంటే డిజిటల్ కరెన్సీ రావాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్డీఏకు కేంద్రంలో 400 కి పైగా, రాష్ట్రంలో 160కి పైగా వస్తాయని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

ప్రజాగళం విజయవంతం - ట్విట్టర్ ద్వారా స్పందించిన చంద్రబాబు


తెలుగుదేశం ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో విజవాయడలోని ఎ కన్వెన్షన్ లో చంద్రబాబు వర్క్ షాప్ నిర్వహించారు.ఎన్టీఆర్ ప్రతిమకు నివాళులర్పించి కార్యక్రమం ప్రారంభించారు. అభ్యర్థులతో పాటు ఇతర నియోజకవర్గాల్లోని ఇంచార్జ్ లు, జనసేన, భాజపా ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, అభ్యర్థులకు ఉండే హక్కులు, అధికార పార్టీ కుట్రలు వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. ఎన్నికల్లో ప్రచారం, నామినేషన్ల దాఖలు వంటి అంశాలపైన నేతలు చర్చించారు. ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులు అనుసరించాల్సిన పద్దతులను, వ్యూహాలపై చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రం కోసం.. దేశం కోసం జట్టు కట్టామని ఆయన స్పష్టంచేశారు. సమర్ధుల ఎంపిక కోసం రాజకీయాల్లో పొలిటికల్ రీఇంజినీరింగ్ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. సోషల్ రీ-ఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉందని అన్నారు. కూటమి నిలబెట్టిన అభ్యర్థి గెలవాలి అనేది మూడు పార్టీల లక్ష్యం కావాలని సూచించారు. రాష్ట్రంలో న్యాయం జరగాలని లోక్‌సత్తా పార్టీ కూడా ముందుకు వచ్చిందని చంద్రబాబు తెలిపారు. పొత్తుల వల్ల అందరికీ సీట్లు ఇవ్వలేకపోయాం కానీ రాష్ట్రo గెలవాలన్నది అందరి నినాదం కావాలని ఆకాంక్షించారు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం పార్టీ కోసం కష్టపడిన వారిలో కొందరికి పొత్తు లేకపోయినా సీటు ఇవ్వలేకపోయామని తెలిపారు. రౌడీయిజం, అధికార దుర్వినియోగాన్ని అభ్యర్థులు ధీటుగా ఎదుర్కోవాలని సూచించారు. ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండి ప్రత్యర్ధుల కుట్రలు ధీటుగా ఎదుర్కోవాలన్నారు. తెలుగు ప్రజలు గెలవాలంటే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి గెలవాలని అన్నారు.
13 ఎంపీ, 11 అసెంబ్లీ అభ్యర్థులతో టీడీపీ మూడో జాబితా విడుదల - TDP Candidates Third List


డ్రగ్స్ పై పోరాడుతుంటే తెలుగుదేశం కార్యాలయంపై దాడి చేశారని ఆయన ఆరోపించారు. గత 5ఏళ్లలో ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై సమీక్ష చేయలేదని విమర్శించారు. ముoద్రా పోర్ట్ లో దొరికిన డ్రగ్స్ కు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడికి సంబంధం బయట పడినా చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. విశాఖలో దొరికిన డ్రగ్స్ భాగోతంలోనూ వైఎస్సార్సీపీ నేతల పాత్ర బట్టబయలైందని చంద్రబాబు విమర్శించారు. అడ్డంగా దొరికిపోయి తెలుగుదేశం నేతలపైనా పురంధేశ్వరిపైనా నిందలు మోపుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర సంపద అంతా హవాలా రూపంలో విదేశాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. డ్రగ్ మాఫియా రాష్ట్రం నుంచి దేశ స్థాయిలో అక్రమాలకు తెరలేపి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి విస్తరించారని చంద్రబాబు దుయ్యబట్టారు.

విశాఖ తీరంలో భారీ డ్రగ్స్ పట్టివేతపై చంద్రబాబు, పవన్ స్పందన- Chandrababu reacted on Drugs Case


వైఎస్సార్సీపీ లాంటి పార్టీలను కట్టడి చేయాలంటే డిజిటల్ కరెన్సీ రావాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. 200, 500 రూపాయల నోట్లను రద్దు చేసే పరిస్థితి రావాలని అన్నారు. పెద్ద నోట్ల రద్దు కావాలనేది తన ఆలోచన అన్న చంద్రబాబు, మోదీ అడుగులు కూడా అలాగే పడుతున్నాయని తెలిపారు. భాజపా అధ్యక్షురాలు రాజీనామా చేసేశారని ఫేక్ లెటర్ పెట్టేసి వైఎస్సార్సీపీ ప్రచారం చేసిందని మండిపడ్డారు. ఇది తాత్కాలిక పొత్తు అని తన పేరుతో ఫేక్ లెటర్లు వదిలారని చంద్రబాబు విమర్శించారు. పురందేశ్వరి తన కుటుంబ సభ్యురాలే కావచ్చు, కానీ ఆమె ముప్పై ఏళ్లకుపైగా వేరే పార్టీల్లో ఉన్నారని తెలిపారు. ఆమె విషయంలో ఎన్నో తప్పుడు వార్తలు రాశారని విమర్శించారు. జనసేన మీద.. పవన్ మీద అలాగే తప్పుడు ప్రచారం చేశారని చంద్రబాబు దుయ్యబట్టారు.


రాష్ట్రంలో రాజకీయ హింస, శాంతి భద్రతలపై ఈసీ దృష్టి సారించాలి: చంద్రబాబు


ఎన్డీఏకు కేంద్రంలో 400+ వస్తాయి.. రాష్ట్రంలో 160+ రావాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. 20+ ఎంపీ స్థానాలను కూటమి గెలవాలని, కడప ఎంపీ మనమే గెలవబోతున్నామని తెలిపారు. 160 సీట్లు గెలవడానికి 160 మీటింగులు పెడుతున్నానని, 160 సెగ్మెంట్లల్లో పర్యటిస్తానని చంద్రబాబు వెల్లడించారు. అభ్యర్థులు ఏ మాత్రం ఏమారినా ఫోన్లు వస్తాయన్నారు. సీట్లు రాని అభ్యర్థుల బాగోగులు తామ చూసుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల్లో అవకాశం కల్పిస్తామని స్పష్టంచేశారు. బాబాయ్ గొడ్డలి పోటు కేసులో ఎన్నో ట్విస్టులని చంద్రబాబు ధ్వజమెత్తారు. సీబీఐ అధికారి మీదే కేసులు పెట్టారు.. ఆయన యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నారని అన్నారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేక సీబీఐ తిరిగి వెళ్లిపోయిందని విమర్శించారు.

వైసీపీ కుట్రలను అడ్డుకోవడంలో పౌరులు బాధ్యత తీసుకోవాలి- సీవిజిల్​ యాప్​ సద్వినియోగం చేసుకోవాలి


టెర్రరిస్టుల తరహాలో వైఎస్సార్సీపీ నేతలు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రం మొత్తం ఐఆర్ఎస్, రైల్వే సర్వీసెస్, ఫారిన్ సర్వీసెస్ అంతా వీళ్లేనని మండిపడ్డారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను సరెండర్ అయ్యారని చంద్రబాబు ఆరోపించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో కొందరు భయపడి.. ఇంకొందరు లాలూచీ పడి పోయారని అన్నారు. ఓ పది మందికి సీట్లిస్తే సామాజిక న్యాయం జరగదన్న చంద్రబాబు..., గ్రేటర్ రాయలసీమ పరిధిలో 41 మందికి రెడ్లకే వైకాపా టిక్కెట్లు ఇచ్చిందని తెలిపారు. తెదేపాలో బీసీలకే పెద్ద పీట వేశామన్నారు. ఆ పార్టీ అభ్యర్థి.. ఈ పార్టీ అభ్యర్థి అని చూడొద్దన్న చంద్రబాబు, అందరూ ఎన్డీఏ అభ్యర్థులుగానే భావించాలని సూచించారు.
హామీలపై బదులిచ్చాకే బస్సెక్కు - జగన్​కు చంద్రబాబు సవాల్ - Chandrababu fire on Jagan

సంప్రదాయ రాజకీయాలు ఉండుంటే మనం కూడా అదే చేసేవాళ్లమని చంద్రబాబు తెలిపారు. ఏపీలో వైఎస్సార్సీపీ ఓడిపోకుంటే రాష్ట్రం నాశనం అవుతుందని పవన్ భావించారన్న చంద్రబాబు, ఓటు చీలకూడదని పవన్ సంకల్పం తీసుకున్నారని అన్నారు. పొత్తుల వల్ల తెలుగుదేశం కోసం పని చేసిన 31 మంది నేతలకు టిక్కెట్లు ఇవ్వలేకపోయామని అన్నారు. ఇక పొత్తులతో సంబంధం లేకుండా కొందరి సీనియర్లకు టిక్కెట్లు ఇవ్వలేకపోయామని తెలిపారు. పెట్టిన అభ్యర్థులు గెలిచేలా బేరీజు వేసుకునే మూడు పార్టీల అభ్యర్థులను నిలబెడుతున్నామన్నారు. పార్టీ పరంగానే కాకుండా సొంతంగా ఓట్లేయించుకునే అభ్యర్థులను ఎంచుకున్నామని వివరించారు. సేవా భావంతో ఉన్న వాళ్లని రాజకీయాల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

Last Updated : Mar 23, 2024, 7:15 PM IST

ABOUT THE AUTHOR

...view details