Chandrababu Allegations on Jagan at Prajagalam Meeting in Eluru:పోలింగ్ రోజున వేసే ఓటుకు తాడేపల్లి ప్యాలెస్ బద్ధలుకావాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఏలూరులో జరిగిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మీ భూమిపై జగన్ పెత్తనమేంటని చంద్రబాబు నిలదీశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ అవినీతి, దోపిడీకి ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. జగన్ అహంకారి, సైకో, విధ్వంసకారుడని విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని గంజాయి మయం చేశారని మండిపడ్డారు. మీ భూమి పత్రంపై సైకో జగన్ ఫొటో ఎందుకని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం లోపభూయిష్టంగా ఉందని చంద్రబాబు అన్నారు. సకల జనుల అభివృద్ధి కోసం పనిచేస్తామని హామీ ఇచ్చారు.
ఫ్యానుకు ఉరేయాలి - వైఎస్సార్సీపీని తరిమేయాలి: చంద్రబాబు - CHANDRABABU PRAJA GALAM MEETING
పోలీసులకు రద్దయిన అలవెన్సులన్నీ ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. అంతే కాకుండా హోంగార్డుల జీతాలు రూ.18 వేల నుంచి రూ.25 వేలకు పెంచుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర భవిష్యత్తు మార్చుకునేందుకు ఇంకా 3 రోజులే ఉందని చంద్రబాబు అన్నారు. అత్యధిక మెజారిటీతో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వైసీపీ ప్రభుత్వ అవినీతి, దోపిడీకి ముగింపు పలకాలని సూచించారు. సమాజ హితం కోసం ప్రజల భవిష్యత్తు కోసం పవన్ కల్యాణ్ ముందుకొచ్చారని అన్నారు. ప్రతి ఒక్కరు సైకో జగన్ను సాగనంపడమే లక్ష్యంగా పెట్టుకోవాలని చంద్రబాబు అన్నారు.