ఏపీ ఓటర్ల తుది జాబితా విడుదల - తప్పులపై రాజకీయ పార్టీల అనుమానాలు - సార్వత్రిక ఎన్నికలు
Andhra Pradesh Voter List 2024: భారీగా దొంగ ఓట్ల నమోదు, ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల ఓట్ల తొలగింపుపై తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది సీఈఓ డాట్ ఆంధ్రా" వెబ్ సైట్ లో జిల్లాల వారీగా తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం పొందుపరిచింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలను ప్రచురించింది.
Andhra Pradesh Voter List 2024:జిల్లాల వారీగా 2024 ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. తుది ఓటర్ల జాబితాలను సీఈఓ ఆంధ్రా వెబ్ సైట్ లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం పొందుపరిచింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలను ప్రచురించింది. నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలను పీడీఎఫ్ అప్ లోడ్ చేసింది. ఓటర్ల జాబితాలను ఎక్కడికక్కడే విడుదల చేయాలని ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది.
2024 తుది ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీలకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా అందజేశారు.
మొత్తం ఓటర్లు
4,08,07,256
పురుషులు
2,00,09,275
మహిళలు
2,07,37,065
ధర్డ్ జెండర్
3482
సర్వీస్ ఓటర్లు
67,434
పెరిగిన ఓటర్ల సంఖ్య: 2024 ఓటర్ల తుది జాబితా వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. రాష్ట్రంలో మెుత్తం ఓటర్ల సంఖ్య 4.8 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2.73 మహిళా ఓటర్లు , 2 కోట్ల 9,275 మంది పురుషులు ఉన్నారు. 67వేల మంది సర్వీస్ ఓటర్లు. 3,482 థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నట్లు ఈసీ పేర్కొంది. గతంలో విడుదల చేసిన ముసాయిదా జాబితా కంటే తుది జాబితాలో పెరిగినట్లు ఈసీ తెలిపింది. సుమారు 6 లక్షల మేర పెరిగిన ఓటర్లు పేరిగారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 20 లక్షల,16 వేల 396 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 7లక్షల 61 వేల 538 మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ వెల్లడించింది.
5.64 లక్షల ఓటర్లను తొలగింపు: చిరునామా లేకుండా, ఒకే ఇంట్లో పదుల సంఖ్యలో ఓటర్ల వివరాలు గుర్తించామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. కొన్ని చోట్ల ఒకే చిరునామాతో 700 మందికి పైగా ఉన్నారని, ఒకే చిరునామాతో అధిక ఓటర్లు ఉన్న ఇళ్లు పరిశీలించినట్లు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఒకే చిరునామాతో అధిక ఓటర్ల సమస్య చాలా వరకు పరిష్కరించినట్లు పేర్కొన్నారు. తప్పుడు వివరాల సమస్యను 98 శాతం వరకు పరిష్కరించినట్లు పేర్కొన్నారు. 14 లక్షల ఓటర్లకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేశాయన్నారు. ఫిర్యాదుల్లో 5.64 లక్షల ఓటర్లకు సంబంధించి తప్పులు గుర్తించినట్లు తెలిపారు. తప్పులకు సంబంధించి ఇప్పటివరకూ 5.64 లక్షల ఓటర్లను తొలగించామని సీఈఓ తెలిపారు. వైసీపీ, టీడీపీకి వేసే ప్రతి ఓటు బీజేపీకే పోతుంది - ఆ పార్టీల ఉచ్చులో పడొద్దు: షర్మిల
తప్పులు చేసిన వారిపై 70 కేసులు: నకిలీ ఓటర్ల పేరుతో ఫారం-7 ఇచ్చి అర్హులను తొలగించినట్లు ఫిర్యాదులు అందాయని ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఓటరు జాబితా రూపొందించే క్రమంలో తప్పులు చేసిన వారిపై 70 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కొత్త ఓటర్లకు సంబంధించి అసెంబ్లీ, జిల్లాస్థాయిలో కలెక్టర్ సమీక్షలు నిర్వహిస్తారని వెల్లడించారు. కొత్త ఓటర్లపై సమీక్ష వివరాలను ఆయా పార్టీలకు అందిస్తామని తెలిపారు. దివ్యాంగులు, 80 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యం కల్పిస్తున్నట్లు ఈసీ పెర్కొన్నారు. రాష్ట్రంలో 80 ఏళ్లు దాటిన వృద్ధులు 5.76 లక్షలుగా ఉన్నారని తెలిపారు. ఇంటి నుంచే ఓటు వేసేందుకు 4.7 లక్షల మంది దివ్యాంగులు దరఖాస్తు చేసుకున్నట్లు ఈసీ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.
తుది జాబితాలో కూడా తప్పులు దొర్లితే!: గత ఏడాది అక్టోబర్ 27న విడుదలైన ముసాయిదా జాబితా పై విమర్శలు వెల్లువెత్తాయి. జీరో డోర్ నెంబర్ తో ఓట్లు, డూప్లికేట్ ఓట్లు పై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని తుది ఓటర్ ల జాబితాలో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివరించారు. తుది జాబితాలో కూడా తప్పులు దొర్లితే ఎలాంటి చర్యలు ఉంటాయో అని అధికారుల్లో ఆందోళన మెుదలైంది.