Police Case On BJP MP Candidate Madhavi Latha :హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిని మాధవీ లతపై స్థానిక బేగంబజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఫస్ట్ లాన్సర్ ప్రాంతానికి చెందిన షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు బేగంబజార్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు.
బీజేపీ ఎంపీ అభ్యర్థిని మాధవీ లతపై కేసు నమోదు - కారణం ఏంటంటే? - Police Case On BJP Madhavi Latha - POLICE CASE ON BJP MADHAVI LATHA
Police Case On BJP MP Candidate Madhavi Latha : హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిని మాధవీ లతపై స్థానిక బేగం బజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ముస్లింల మనోభావాలను దెబ్బతీసినట్లు ఆరోపిస్తూ షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు.
Published : Apr 21, 2024, 10:23 PM IST
మాధవీ లతను హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించినప్పటి నుంచి ఓ వర్గానికి (ముస్లిం కమ్యూనిటీ) వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నట్లు షేక్ ఇమ్రాన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 17న రాత్రి శ్రీ రామ నవమి శోభాయాత్ర సందర్భంగా బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్దంబర్ బజార్ వద్ద ఓ మసీదుపై బాణం వదులుతున్నట్లు వ్యవహరించి ముస్లింల మనోభావాలను దెబ్బ తీసినట్లు పోలీసులకు తెలిపారు. ఈ నెల 20న తమకు ఫిర్యాదు అందిందని, మాధవీ లతపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు.