తెలంగాణ

telangana

ETV Bharat / politics

కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక - అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - Cantonment by election 2024 - CANTONMENT BY ELECTION 2024

Cantonment BJP Candidate 2024 for By Election : మే 13వ తేదీన జరగనున్న సికింద్రాబాద్​ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గ​ ఉప ఎన్నికకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. టి.ఎన్.వంశా తిలక్ బరిలో నిలవనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా వెల్లడించింది.

Cantonment by election 2024
BJP Cantonment Candidate 2024

By ETV Bharat Telangana Team

Published : Apr 16, 2024, 11:59 AM IST

Updated : Apr 16, 2024, 12:20 PM IST

Cantonment BJP Candidate 2024 for By Election : సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉప ఎన్నికకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా వంశా తిలక్‌ ఖరారయ్యారు. ఎమ్మెల్యే లాస్య నందితరోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ స్థానంలో ఖాళీ ఏర్పడింది. ఇప్పటికే బీఆర్​ఎస్​ తన అభ్యర్థిగా లాస్య నందిత సోదరి నివేదితను బరిలోకి దించింది. గత శాసనసభ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి నారాయణ శ్రీ గణేశ్‌ ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. దీంతో శ్రీగణేశ్‌కే కాంగ్రెస్‌ టికెట్‌ ఖరారు చేసింది.

రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే ఖరారైన నేపథ్యంలో బీజేపీ ఎవరిని ఎంపిక చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ తరుణంలో తమ అభ్యర్థిగా డాక్టర్‌ వంశా తిలక్‌ను ఖరారు చేస్తూ ఆ పార్టీ నాయకత్వం ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ తొలి దశ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన టీఎన్​ సదాలక్ష్మి కుమారుడైన వంశాతిలక్‌, వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు. కంటోన్మెంట్‌ నుంచి పోటీ చేసేందుకు బీజేపీకి చెందిన పలువురు నేతలు ఆసక్తి కనబర్చినా, సామాజిక, రాజకీయ అంశాల దృష్ట్యా వంశా తిలక్‌నే ఆ పార్టీ నాయకత్వం ఖరారు చేసింది. మే 13న లోక్‌సభ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ జరగనుంది. జూన్​ 4న ఫలితాలు వెల్లడి కానున్న సంగతి తెలిసిందే.

కంటోన్మెంట్ బీఆర్ఎస్​ అభ్యర్థినిగా నివేదిత - అధికారికంగా ప్రకటించిన కేసీఆర్

సరిగ్గా ఏడాది వ్యవధిలో తండ్రీ - కుమార్తె మృతి : ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌పై జరిగిన యాక్సిడెంట్​లో కంటోన్మెంట్​ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న ఓ కంటైనర్​ను ఢీకొని, ఆ తర్వాత రోడ్డు పక్కనే ఉన్న రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్​ తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. సరిగ్గా ఏడాది క్రితం లాస్య నందిత తండ్రి, దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న పరమపదించారు. గుండె, కిడ్నీ సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆయన, గుండెపోటు రావడంతో 2023 ఫిబ్రవరిలో కన్నుమూయడం గమనార్హం.

కంటోన్మెంట్​ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించిన ఏఐసీసీ​ - నారాయణ శ్రీ గణేశ్‌కు ఛాన్స్

Last Updated : Apr 16, 2024, 12:20 PM IST

ABOUT THE AUTHOR

...view details