తెలంగాణ

telangana

ETV Bharat / politics

నా కుమార్తె జైళ్లో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉండదా? : కేసీఆర్‌ - BRSLP Meeting Today 2024 - BRSLP MEETING TODAY 2024

BRSLP Meeting Today 2024 : రాజకీయ కక్షతోనే ఎమ్మెల్సీ కవితను జైల్లో పెట్టారని, కుమార్తె జైల్లో ఉంటే కన్నతండ్రిగా బాధ ఉండదా? అని బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్ఎస్​ఎల్పీ మీటింగ్ జరిగింది. బడ్జెట్​ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గులాబీ బాస్​ దిశానిర్దేశం చేశారు.

BRS Debate on Congress Promises
BRS Legislative Party Conference (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 23, 2024, 3:52 PM IST

Updated : Jul 23, 2024, 9:33 PM IST

BRS Legislative Party Conference Today : బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన బీఆర్ఎస్​ శాసనసభా పక్షం బడ్జెట్ సమావేశాల వ్యూహాన్ని ఖరారు చేసింది. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు. నిరుద్యోగుల సమస్యలు-అక్రమ అరెస్టులు, హామీలు అమల్లో వైఫల్యం, రుణమాఫీ, పౌరసరఫరాల శాఖలో కుంభకోణాలు, నకిలీ మద్యం వ్యవహారం, ఆర్టీసీ విలీనం, ఫీజు రీఎంబర్స్​మెంట్ బకాయిల విడుదల, పెన్షన్లు, శాంతి భద్రతలు, విదేశీ విద్యానిధి, తదితర అంశాలను ఉభయసభల్లో లేవనెత్తాలని నిర్ణయించారు.

రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని బీఆర్ఎస్​ ఆరోపించింది. వాటి వెనకున్న అదృశ్య శక్తుల నిగ్గు తేల్చాలని డిమాండ్ చేసింది. మాట నిలబెట్టుకోవాలని కోరుతున్న నిరుద్యోగుల వీపులు పగలగొడుతున్నారని, అక్రమ అరెస్టులు, కేసులతో భయభ్రాంతులకు గురి చేస్తోందని గులాబీ పార్టీ​ మండిపడింది. నిరుద్యోగుల అంశంపై రేపు వాయిదా తీర్మానం ఇచ్చి పోరాడాలని నిర్ణయించారు.

BRS Legislative Council Leader Madhusudanachari :శాసనమండలిలో బీఆర్ఎస్​ పక్ష నేతగా, ప్రతిపక్ష నేతగా మధుసూదనాచారిని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. శాసనసభలో కేసీఆర్ ప్రతిపక్షనేతగా ఉన్నందున, మండలిలో బీసీకి అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే శాసనసభ, మండలిలో బీఆర్ఎస్​ పక్ష కార్యవర్గం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత 25, 26 తేదీల్లో మేడిగడ్డ, కన్నేపల్లి పర్యటనకు వెళ్లాలని బీఆర్ఎస్​ శాసనసభా పక్షం నిర్ణయించింది.

గోదావరిలో ఉన్న నీటిని ఎత్తిపోసి రైతులకు నీరు ఇచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఇవ్వడం లేదని, జలాశయాలకు నీటిని మల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పర్యటన చేపట్టనున్నట్లు పేర్కొంది. పార్టీ ఫిరాయింపుల విషయమై సభలో ప్రత్యేకవ్యూహంతో ముందుకెళ్తామని మాజీ మంత్రి హరీశ్​రావు తెలిపారు. బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ వస్తారని అన్నారు.

నా కుమార్తె జైళ్లో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉండదా? :బీఆర్​ఎస్​ఎల్పీ మీటింగ్ అనంతరం గులాబీ బాస్​ కేసీఆర్ పలు విషయాలపై​ మాట్లాడారు. అందులో భాగంగానే కవిత అరెస్ట్​పై స్పందించారు. రాజకీయ కక్షతోనే తన కుమార్తె కవితను జైల్లో పెట్టారని, సొంత కుమార్తె జైల్లో ఉంటే కన్నతండ్రిగా బాధ ఉండదా? అని కేసీఆర్‌ అన్నారు.

తాను అగ్నిపర్వతంలా ఉన్నట్లు పేర్కొన్నారు. పార్టీలో క్లిష్ట పరిస్థితులు ఏమీ లేవన్న ఆయన, ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితుల్లోనే తెలంగాణ సాధించామని తెలిపారు. నలుగురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌ అధికారంలోకి రాలేదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యే, బాగా ఎదుగుతారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ సర్కార్ పాలనపై పట్టు సాధించలేకపోయిందని, పాలనపై దృష్టి పెట్టకుండా బద్నాం చేసే పనిలో ఉన్నారని ధ్వజమెత్తారు.

'రెండు రోజుల్లో 15 పద్దులపై చర్చ ఎట్లా సాధ్యం?' - BRS MLA Harish Rao On BAC Meeting

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరం : కేటీఆర్‌ - KTR On Central Budget Funds

Last Updated : Jul 23, 2024, 9:33 PM IST

ABOUT THE AUTHOR

...view details