కుటుంబ నియంత్రణ అమలుచేసిన రాష్ట్రాలను శిక్షించడం తగదు - తమిళనాడు సీఎం వ్యాఖ్యలకు కేటీఆర్ మద్దతు - KTR SUPPORTS TAMIL NADU CM COMMENTS
తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యాఖ్యలను సమర్థించిన కేటీఆర్ - నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి అన్యాయమన్న కేటీఆర్

Published : Feb 26, 2025, 1:34 PM IST
KTR On Redistribution : నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి అన్యాయం చేయవద్దని తమిళనాడు సీఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమర్థించి, మద్దతిచ్చారు. కుటుంబ నియంత్రణ అమలు చేసిన రాష్ట్రాలను శిక్షించడం తగదని కేటీఆర్ పేర్కొన్నారు. దక్షిణాది పనితీరును పట్టించుకోకపోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. దేశ నిర్మాణంలో దక్షిణాది రాష్ట్రాల పాత్రను ఎవరూ విస్మరించలేరని తెలిపారు. దేశంలో తెలంగాణ జనాభా 2.8 శాతం ఉంటే జీడీపీ 5.2 శాతం అందిస్తోందని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.