BRS Situation at Station Ghanpur : లోక్‌సభ ఎన్నికల వేళ కీలక నాయకుల వలసలతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అధికారాన్ని కోల్పోయి నాలుగు నెలలు కూడా గడవక ముందే కీలక నేతలంతా ఇతర పార్టీల్లోకి వరుస కడుతున్నారు. సిట్టింగ్ ఎంపీలు మొదలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మాజీలు ఇలా వివిధ స్థాయిలోని వారు కాంగ్రెస్, బీజేపీల్లో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు గులాబీ కండువాను పక్కకు పెట్టగా, ఇంకా కొంత మంది పార్టీకి గుడ్ బై చెప్తారని ప్రచారం జోరుగా సాగుతోంది.
Kadiyam Srihari Joined Congress :తాజా పరిణామాలన్నీ బీఆర్ఎస్ హైకమాండ్‌కు ఇబ్బందికరంగా మారాయి. అసలే అధికారం కోల్పోవడంతో పాటు ఇతర సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో, నేతల వలసలు మరింత ఇక్కట్లలోకి నెట్టాయి. తాజాగా ఆదివారం నాడు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Join Congress) గులాబీ పార్టీ వీడి, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో నియోజకవర్గంలో పార్టీని నడిపించే నేత ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. వరంగల్ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరింటిని హస్తం పార్టీ కైవసం చేసుకోగా, స్టేషన్‌ఘన్‌పూర్ ఒక్కటే భారత్ రాష్ట్ర సమితి గెలిచింది.
రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు పార్టీ వీడుతున్నారు: హరీశ్‌రావు - Harishrao hot comments
Lok Sabha Election 2024 : మారిన రాజకీయ పరిస్ధితుల్లో భాగంగా ఆయన మూడు మాసాల్లోనే గులాబీ పార్టీని వదిలి కాంగ్రెస్‌లో చేరారు. ఈ క్రమంలో ఇటీవల భారత్ రాష్ట్ర సమితికి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను తిరిగి పార్టీలోకి తీసుకురావాలని కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇది ఎంత వరకు ఫలితం ఇస్తుందో చూడాలి.