తెలంగాణ

telangana

ETV Bharat / politics

'ఓడిపోయే పార్టీ నుంచి కావ్య పోటీ వద్దనుకున్నాం - అందుకే తగిన నిర్ణయం తీసుకున్నాం' - Kadiyam Srihari Meet with Activists

BRS MLAs Complaint Against Kadiyam Srihari in Assembly : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేయడానికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లారు. కాంగ్రెస్‌ పార్టీలో కడియం చేరతారనే సంకేతాల నేపథ్యంలో ముందుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు కార్యకర్తలు, అనుచరులతో కడియం సమావేశమయ్యారు.

BRS MLAs Complaint Against Kadiyam Srihari in Assembly
BRS MLAs Complaint Against Kadiyam Srihari in Assembly

By ETV Bharat Telangana Team

Published : Mar 30, 2024, 3:07 PM IST

Updated : Mar 30, 2024, 3:39 PM IST

BRS MLAs Complaint Against Kadiyam Srihari in Assembly : ఓడిపోయే పార్టీ నుంచి కావ్య పోటీ వద్దనుకున్నామని, అందుకే అడగకుండానే నిర్ణయం తీసుకున్నామని మాజీ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేయమని పిలుపు వచ్చిందని స్పష్టం చేశారు. అందరి అభిప్రాయం మేరకే తన నిర్ణయం ఉంటుందని ఆయన చెప్పారు. తనను విమర్శించే నైతిక హక్కు ఎవరికీ లేదన్నారు. మీ ఇంటి బిడ్డగా కావ్య (Kadiyam Kavya)ను నిండు మనసుతో ఆశీర్వదించాలని కడియం శ్రీహరి కోరారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో తన అనుచరులతో కడియం శ్రీహరి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కడియం కావ్య, ముఖ్య నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ ఇప్పుడు చాలా మంది బీఆర్‌ఎస్‌ నేతలు అయోమయంలో ఉన్నారని చెప్పారు. ఆరూరి రమేశ్‌ వద్దు అంటేనే కావ్యకు టికెట్‌ ఇచ్చారని, బీఆర్‌ఎస్‌ నాయకత్వంపై విమర్శలు చేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ బలహీన పడిందని (BRS Party in Warangal) ఆరోపించారు. వరంగల్‌ బీఆర్‌ఎస్‌ నేతల నుంచి సహకారం లభించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అయితే కడియం శ్రీహరి ఏ నిర్ణయం తీసుకున్నా, మద్దతు ఇస్తామని నేతలు ఆయనకు మాటిచ్చారు.

"నేను పార్టీ మారుతున్నానంటే బీఆర్‌ఎస్‌ పార్టీకి భయం ఎందుకు. పసునూరి దయాకర్‌, ఆరూరి రమేశ్‌ పార్టీ మారితే లేని అభ్యంతరం, నా విషయంలో బీఆర్‌ఎస్‌ ఎందుకు చేస్తోంది. నా రాజకీయ జీవితంలో నాపై ఒక్క అవినీతి ఆరోపణ లేదు. నాపై ఒక్క పిట్టి కేసు లేదు. ఇప్పుడు నాపై మాట్లాడుతున్న నేతలపై అధికారం పోగానే ఎందుకు డజన్ల కొద్దీ కేసులు అవుతున్నాయి. ఇక నా రాజకీయ జీవితం ప్రజలకే అంకితం. ఒక్క రోజు కూడా కేసీఆర్‌, కేటీఆర్‌ ఉద్యమకారులను దగ్గరికి రానివ్వలేదు. నేను కాంగ్రెస్‌లోకి వెళితే, నాకు వచ్చిన అవకాశాన్ని నియోజకవర్గ అభివృద్ధి కోసం ఉపయోగిస్తా."- కడియం శ్రీహరి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

Kadiyam Srihari Comments on BRS :పక్క జిల్లాలు పాలకుర్తి, జనగామ నియోజకవర్గాల్లో ఎలా అభివృద్ధి జరిగిందని కడియం శ్రీహరి ప్రశ్నించారు. ఒక్క స్టేషన్‌ ఘన్‌పూర్‌ మాత్రమే ఎందుకు వెనకబడిందని నిలదీశారు. తనకు వచ్చిన అవకాశాన్ని స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గ(Station Ghanpur) అభివృద్ధి కోసం ఉపయోగిస్తామన్నారు. తన కోసం పదవులు పణంగా పెట్టి వస్తున్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు అందరినీ కాపాడుకుంటాానని మాటిచ్చారు. పాత కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అందరినీ కలుపుకొని ముందుకు వెళతానని స్పష్టం చేశారు.

కడియంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఫిర్యాదు : అంతకు ముందు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేసేందుకు అసెంబ్లీకి వెళ్లారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గ ప్రజల అభిప్రాయం మేరకు రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైనట్లు మాజీ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. శనివారం (నేడు) విలేకరుల సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు.

కడియం శ్రీహరితో కాంగ్రెస్​ నేతల భేటీ - త్వరలో నిర్ణయం వెల్లడిస్తానన్న ఎమ్మెల్యే

ఎన్నికల ముంగిట బీఆర్​ఎస్​కు బిగ్​ షాక్‌ - వరంగల్‌ ఎంపీ బరి నుంచి తప్పుకున్న కడియం కావ్య

Last Updated : Mar 30, 2024, 3:39 PM IST

ABOUT THE AUTHOR

...view details