తెలంగాణ

telangana

ETV Bharat / politics

మరో రెండు స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్​ఎస్​ - మల్కాజిగిరి బరిలో లక్ష్మారెడ్డి

BRS Lok Sabha 2024 Candidates List Release : లోక్​సభ ఎన్నికలకు బీఆర్​ఎస్​ పూర్తి సన్నద్ధతతో బరిలోకి దిగడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో బీఆర్​ఎస్​ పార్లమెంటు అభ్యర్థుల పేర్లను కేసీఆర్​ ప్రకటిస్తున్నారు. నేడు మరో ఇద్దరి పేర్లను బీఆర్​ఎస్​ ప్రకటించింది. ఇందులో ఆదిలాబాద్​, మల్కాజిగిరి అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.

BRS Lok Sabha 2024 Candidates List Release
BRS Lok Sabha 2024 Candidates List Release

By ETV Bharat Telangana Team

Published : Mar 14, 2024, 9:44 PM IST

Updated : Mar 15, 2024, 3:01 PM IST

BRS Lok Sabha 2024 Candidates List Release

BRS Lok Sabha 2024 Candidates List Release :మరో రెండు స్థానాలకు భారత రాష్ట్ర సమితి (BRS) అభ్యర్థులను ప్రకటించింది. మల్కాజిగిరి లోక్​సభ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి పేరును, ఆదిలాబాద్ అభ్యర్థిగా ఆత్రం సక్కు పేర్లను ప్రకటించారు. ఆదిలాబాద్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన నగేష్ పార్టీని వదిలి బీజేపీలో చేరారు. ఆసిఫాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆత్రం సక్కుకు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ అవకాశం ఇవ్వలేదు. లోక్​సభ ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని అప్పట్లోనే హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా ఆదిలాబాద్ లోక్​సభ అభ్యర్థి(Adilabad Lok Sabha Seat)గా ఆత్రం సక్కు పేరును కేసీఆర్ ఖరారు చేసి ప్రకటించారు.

మల్కాజ్ గిరి నుంచి గత పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన మర్రి రాజశేఖర్ రెడ్డి ఇటీవల శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన రాగిడి లక్ష్మారెడ్డి శాసననసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్​ను వీడి బీఆర్​ఎస్​లో చేరారు. రానున్న లోక్​సభ ఎన్నికల్లో(Lok Sabha Polls) ఆయన పేరును మల్కాజిగిరి స్థానానికి ఖరారు చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

బీఆర్​ఎస్​తో పొత్తుకు మాయావతి అంగీకారం - త్వరలో కేసీఆర్‌తో తదుపరి చర్చలు

Lok Sabha Polls 2024 : ఇప్పటి వరకు మొత్తం 17 స్థానాలకు గానూ 11 స్థానాలకు బీఆర్​ఎస్​ అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వాటిలో హైదరాబాద్​, సికింద్రాబాద్​, భువనగిరి, నల్గొండ, మెదక్​, నాగర్‌ కర్నూల్‌ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. చాలా నియోజకవర్గాల్లో బీఆర్​ఎస్​ పార్టీకి అభ్యర్థులు దొరకడం కష్టంగా మారింది. అక్కడ ఉన్న సిట్టింగ్​ ఎంపీలు కొందరు బీజేపీ, కాంగ్రెస్​ పార్టీల్లో చేరారు. కొంత మంది సిట్టింగ్​లు పోటీకి విముఖత వ్యక్తం చేశారు. అప్పటివరకు పోటీ చేస్తామని చెప్పిన నేతలు కూడా మారుతున్న రాజకీయ పరిస్థితులకు పోటీ నుంచి తప్పుకుంటున్నారు. అధికారంలో లేకపోవడం కూడా బీఆర్​ఎస్​కు ప్రతికూలంగా మారుతుంది.

బీఆర్​ఎస్​ ప్రకటించిన స్థానాలివే :

  • వరంగల్‌ - కడియం కావ్య
  • చేవెళ్ల - కాసాని జ్ఞానేశ్వర్‌
  • జహీరాబాద్‌ - గాలి అనిల్‌కుమార్‌
  • నిజామాబాద్‌ - బాజిరెడ్డి గోవర్ధన్‌
  • కరీంనగర్‌ - బి.వినోద్‌ కుమార్‌
  • పెద్దపల్లి - కొప్పుల ఈశ్వర్‌
  • మహబూబాబాద్‌ - మాలోత్‌ కవిత
  • మహబూబ్‌నగర్‌ - మన్నె శ్రీనివాస్‌రెడ్డి
  • ఖమ్మం- నామా నాగేశ్వరరావు
  • ఆదిలాబాద్​- ఆత్రం సక్కు
  • మల్కాజిగిరి- రాగిడి లక్ష్మారెడ్డి

లోక్​సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సమాయత్తమవుతున్న ప్రధాన పార్టీలు

చేవెళ్ల లోక్​సభలో త్రిముఖ పోటీ - ఎవరు గెలుస్తారో చూడాలి మరీ?

Last Updated : Mar 15, 2024, 3:01 PM IST

ABOUT THE AUTHOR

...view details