ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

కొండా సురేఖ పబ్లిసిటీ కోసమే ఆ వ్యాఖ్యలు చేశారు - పరువునష్టం దావాపై కేటీఆర్ వాంగ్మూలం - KTR STATEMENT

నాంపల్లి కోర్టుకు హాజరైన మాజీ మంత్రి కేటీఆర్ - పరువునష్టం దావాపై వాంగ్మూలం ఇచ్చిన మాజీ మంత్రి

BRS Leader KTR Attend Nampally Court
BRS Leader KTR Attend Nampally Court (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 23, 2024, 5:49 PM IST

Updated : Oct 23, 2024, 7:03 PM IST

BRS Leader KTR Attend Nampally Court :నాంపల్లి కోర్టుకు తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. పరువు నష్టం దావాపై దాదాపు 20 నిమిషాల పాటు ఆయన స్టేట్‌మెంట్‌ను న్యాయస్థానం రికార్డు చేసింది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో తన పరువు ప్రతిష్ఠలు దెబ్బతిన్నాయని అన్నారు. పబ్లిసిటీ కోసమే కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని తెలిపారు.

మంత్రి వ్యాఖ్యలు తనతో పాటు బీఆర్‌ఎస్‌కు ప్రతిష్టకు ఇబ్బందని కేటీఆర్ పేర్కొన్నారు. తాను డ్రగ్ అడిక్ట్ అని, రేవ్ పార్టీలు నిర్వహిస్తానని సురేఖ వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. కొండా సురేఖ వ్యాఖ్యలను టీవీల్లో చూసి సాక్షులు ఫోన్‌ చేశారని, సాక్షులు తనకు 18 ఏళ్లుగా తెలుసని వెల్లడించారు. కేటీఆర్‌ వెంట సాక్షులు దాసోజు శ్రవణ్‌, సత్యవతి రాథోడ్‌, బాల్కసుమన్‌, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి నాంపల్లి కోర్టుకు వచ్చారు. కేటీఆర్‌తో పాటు దాసోజు శ్రవణ్‌ వాంగ్మూలాలు నమోదు చేసిన నాంపల్లి కోర్టు మిగిలిన సాక్షుల వాంగ్మూలాలను ఈనెల 30న నమోదు చేయనుంది.

24 గంటల్లోగా క్షమాపణలు చెప్పాలి - మంత్రి కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు - KTR Notice to Konda Surekha

BRS Leader KTR Sent Legal Notice to Union Minister Bandi Sanjay :కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు తెలంగాణ బీఆర్​ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని, తనకు పరువుకు నష్టం కలిగేంచేలా వ్యాఖ్యలు చేశారంటూ నోటీసులు ఇచ్చారు. చేసిన నిరాధార వ్యాఖ్యలకు వారం రోజుల్లోగా బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు.

బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను నిరూపించాలి :ఈ నెల 19న బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని డ్రగ్స్ తీసుకుంటానని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డానని అన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుల నుంచి తప్పించుకోవటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రహస్యంగా కలిసిపోయానంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను నిరూపించాలని డిమాండ్‌ చేశారు. కేవలం తనను అప్రతిష్ట పాలు చేయాలన్న దురుద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆక్షేపించారు. రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ క్షమాపణ చెప్పకుంటే క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ లీగల్ నోటీసులో హెచ్చరించారు.

క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా - కేటీఆర్​-బండి సంజయ్​ లీగల్​ వార్​

Last Updated : Oct 23, 2024, 7:03 PM IST

ABOUT THE AUTHOR

...view details