బీఆర్ఎస్, బీజేపీ దోస్తులైతే కవిత జైల్లో ఎందుకుంటుంది? - వాళ్లను నమ్మి మళ్లీ మోసపోవద్దు : కేటీఆర్ KTR Fires On CM Revanth Reddy :సీఎం రేవంత్ రెడ్డి మల్కాజిగిరి ప్రజల కాళ్లు కడిగి నెత్తిన చల్లుకోవాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డిని మల్కాజిగిరి ప్రజలు ఎంపీనీ, పీసీసీ అధ్యక్షుడ్ని, ముఖ్యమంత్రిని చేస్తే రేవంత్ రెడ్డి ఈ ప్రాంతానికి ఏం చేశారని ప్రశ్నించారు. కనీసం పార్లమెంటులో మల్కాజిగిరి ఊసే ఎత్తలేదని విమర్శించారు. బీఆర్ఎస్ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ సందర్భంగా శామీర్‌పేట వద్ద నిర్వహించిన ర్యాలీలో మాజీ మంత్రి మల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు.
KTR Comments ON PM Modi :గత పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ 5 వేల ఓట్లతో ఓడిపోయిందని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలోని వలస పక్షులకు ఓటు వేస్తే స్థానికంగా ఉండరని, అందుకే పక్కా లోకల్ అయిన బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ 10 నుంచి 12 సీట్లు గెలిస్తే ఏడాదిలోనే కేసీఆర్ రాజకీయాలను శాసిస్తారని పేర్కొన్నారు. యాదగిరిగుట్ట దేవాలయాన్ని పునఃనిర్మించిన కేసీఆర్ దేవుడిని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయడం లేదని స్పష్టం చేశారు.
'కాంగ్రెస్ అసలు రంగు ఇప్పుడిప్పుడే బయటపడుతోంది - నిరుద్యోగ యువత గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చింది' - KTR Tweet On Congress
దేశంలో రూ.400 ఉన్న సిలిండర్‌ను మోదీ రూ.1200కు పెంచారు. సెంటిమెంట్‌కు పోయి ఓట్లు వేస్తే ఆగం అవుతాం. బీజేపీ పోటీ చేసేదే 420 సీట్లలో అయితే 400 సీట్లు వస్తాయా? బీఆర్ఎస్, బీజేపీ కలిసే ఉంటే కవితను జైళ్లో ఎందుకు వేస్తారు. పదేళ్లలో మల్కాజిగిరికి బీజేపీ ఏం చేసింది. కేసీఆర్ 36 వంతెనలు కడితే ఉప్పల్, అంబర్‌పేట్‌లో బీజేపీ రెండు వంతెనలు కూడా కట్టలేకపోయింది. యూపీలో బీజేపీపై పోరాడలేక రాహుల్ కేరళకు పారిపోయారు. కాంగ్రెస్, బీజేపీని నమ్మి ప్రజలు రెండోసారి మోసపోవద్దు. - కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
ప్రియమైన ప్రధాని కాదు పిరమైన ప్రధాని :మోదీ అక్షింతలు పంపిస్తే కేసీఆర్ దేశం మొత్తానికి బియ్యం పంపించారని కేటీఆర్ అన్నారు. దేశంలో ప్రియమైన ప్రధాని కాదు పిరమైన ప్రధాని ఉన్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం లేదనే బాధ ప్రజల్లో ఉందని, ఆయనను బతిమిలాడుకునే రోజు వస్తుందని వ్యాఖ్యానించారు. మల్కాజిగిరిలో వలస పక్షులైన ఈటల రాజేందర్, సునీతా మహేందర్ రెడ్డి ఎన్నికల తర్వాత కనిపించరని తెలిపారు.' ఒకసారి వాళ్లు మిమ్మల్ని మోసం చేశారు, రెండోసారి మోసపోతే మన తప్పే అవుతుంది. అందుకే బీఆర్ఎస్కు ఓటువేసి గెలిపించండి' అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
లోక్‌సభ ఎన్నికల్లో 10 ఎంపీ సీట్లలో గెలిపిస్తే - రాజకీయంగా చాలా మార్పులు తీసుకొస్తాం : కేటీఆర్ - KTR Interesting Comments
అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది - మరోసారి మోసానికి తెరలేపింది : కేటీఆర్ - KTR ROAD SHOW IN RAJENDRANAGAR