తెలంగాణ

telangana

ETV Bharat / politics

జహీరాబాద్​ బీఆర్​ఎస్​ లోక్​సభ అభ్యర్థిగా గాలి అనిల్​ కుమార్​! - ఖరారు చేసిన కేసీఆర్ - Zaheerabad BRS Lok Sabha Candidate

BRS Focus on Zaheerabad Lok Sabha Candidate : జహీరాబాద్​ లోక్​సభ అభ్యర్థిపై బీఆర్​ఎస్​ పార్టీ స్పెషల్​ ఫోకస్​ పెట్టింది. ఇందుకు బీఆర్​ఎస్​ అధ్యక్షుడు కేసీఆర్​ ప్రత్యేకంగా జహీరాబాద్​ నియోజకవర్గంతో పాటు సీనియర్​ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జహీరాబాద్​ అభ్యర్థిగా గాలి అనిల్​ కుమార్​ను అధినేత నిర్ణయించినట్లు సమాచారం.

BRS Focus on Zaheerabad Lok Sabha
BRS Focus on Zaheerabad Lok Sabha Candidate

By ETV Bharat Telangana Team

Published : Mar 10, 2024, 9:02 PM IST

Updated : Mar 10, 2024, 10:22 PM IST

BRS Focus on Zaheerabad Lok Sabha Candidate :ఈ నెల 13న లోక్​సభ ఎన్నికలకు నోటిఫికేషన్​ వస్తుందన్న ప్రచారంతో అభ్యర్థుల ఎంపికపై బీఆర్​ఎస్​ ముమ్మర కసరత్తు చేస్తోంది. కరీంనగర్​ నుంచి వినోద్​ కుమార్​, జగిత్యాల నుంచి కొప్పుల ఈశ్వర్​, ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్​ నుంచి మాలోత్​ కవితను ఇప్పటికే కేసీఆర్(KCR)​ ప్రకటించారు. అయితే ఇప్పుడు జహీరాబాద్​ అభ్యర్థిపై బీఆర్​ఎస్​ దృష్టి సారించింది. అందులో భాగంగా జహీరాబాద్​ నియోజకవర్గ పరిధిలోని నేతలతో బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ సుధీర్ఘంగా సమావేశమయ్యారు. శాసనసభ మాజీ స్పీకర్​ పోచారం శ్రీనివాస్​ రెడ్డి, మాజీ మంత్రులు హరీశ్​రావు, ప్రశాంత్​ రెడ్డి, నియోజకవర్గ పరిధిలోని పార్టీ నేతలు సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సమావేశంలో జహీరాబాద్​ నియోజకవర్గం (Zaheerabad Lok Sabha) నుంచి బీఆర్​ఎస్​ అభ్యర్థిగా గాలి అనిల్​ కుమార్​ పేరును పార్టీ దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. లోక్​సభ ఎన్నికల కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. సిట్టింగ్​ ఎంపీ బీబీ పాటిల్​ పార్టీకి గుడ్​బై చెప్పి బీజేపీ చేరారు. దీంతో జహీరాబాద్​కు కొత్త అభ్యర్థిని దింపాల్సిన పరిస్థితి గులాబీ పార్టీకి ఏర్పడింది. ఎన్నికల కార్యాచరణతో పాటు అభ్యర్థిత్వంపై నేతలందరి అభిప్రాయాలను కేసీఆర్​ తీసుకున్నారు. అభ్యర్థిత్వ ఖరారుపై నిర్ణయాన్ని అందరూ అధినేతకు అప్పగించారు.

జహీరాబాద్​లో గెలుపు అవకాశాలు : అందరి అభిప్రాయాలకు అనుగుణంగా సీనియర్​ నేత గాలి అనిల్​ కుమార్​ పేరును అధినేత ఖరారు చేసినట్లు సమాచారం. మెదక్​ అభ్యర్థిని కూడా ఖరారు చేసిన తర్వాత జహీరాబాద్​ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. బీబీ పాటిల్​ వేరే పార్టీలో చేరిన పార్టీకి నష్టం లేదని, పార్టీ పటష్ఠంగానే ఉందని కేసీఆర్​ నేతలతో చెప్పారు. జహీరాబాద్​లో బీఆర్​ఎస్(BRS)​ గెలుపునకు మంచి అవకాశాలు ఉన్నాయని, నేతలందరూ కష్టపడి గుండా జెండా మరోమాపు ఎగిరేలా చూడాలని కేసీఆర్​ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

'అతికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్​ ప్రభుత్వంపై వ్యతిరేకత - కరీంనగర్​లో బీఆర్​ఎస్ ​- బీజేపీ మధ్యే పోటీ'

BRS Focus on Lok Sabha Polls 2024 :ఇప్పటికే చాలా లోక్​సభ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి బీఆర్​ఎస్​ పార్టీకి అభ్యర్థులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో చేవెళ్ల సిట్టింగ్​ ఎంపీ రంజిత్​ రెడ్డి సైతం పోటీకి నిరాకరించారు. ఇప్పటికే నాగర్​ కర్నూల్​ సిట్టింగ్​ ఎంపీ రాములు బీజేపీ తీర్థం పుచ్చుకుని, తన కుమారుడు భరత్​ కుమార్​కు టికెట్​ ఇప్పించుకున్నారు. ఇప్పుడు ఈ స్థానంలో అభ్యర్థిని నిలబెట్టేందుకు బీఆర్​ఎస్​ అన్ని ప్రయత్నాలను చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే నలుగురు బీఆర్​ఎస్​ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన కేసీఆర్​ మరో 13 మంది లోక్​సభ అభ్యర్థుల కోసం కసరత్తు చేస్తున్నారు. ఆదివారం మరో ఇద్దరు బీఆర్​ఎస్​ మాజీ ఎంపీలు సీతారాం నాయక్​, నగేశ్​ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో ఇప్పుడు బీఆర్​ఎస్​ పార్టీ అభ్యర్థుల అన్వేషణలో పూర్తి దృష్టి కేంద్రీకరించింది.

పోటీకి సిట్టింగ్​ ఎంపీ విముఖత - చేవెళ్ల పార్లమెంట్​లో ప్రత్యామ్నాయ అభ్యర్థి కోసం బీఆర్​ఎస్ అన్వేషణ

బీఆర్​ఎస్​ను వీడి కాంగ్రెస్​లోకి జహీరాబాద్ ఎమ్మెల్యే - క్లారిటీ ఇచ్చిన మాణిక్​ రావు

Last Updated : Mar 10, 2024, 10:22 PM IST

ABOUT THE AUTHOR

...view details