Who will win in AP : హోరాహోరీ ఎన్నికల్లో పలు పరిణామాలు కూటమి విజయం ఖాయమని చాటుతున్నాయి. ఇప్పటికే కేంద్రం నిర్వహించిన సర్వేలో వైఎస్సార్సీపీపై ప్రజల్లో ఆగ్రహం ఉందని తేలగా మరో ఐదు బలమైన కారణాలు ఏపీలో మార్పు ఖాయమని స్పష్టం చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా వైఎస్సార్సీపీ అభ్యర్థులు, వారి అనుచరుల అరాచకాలు, మరోవైపు గత ఎమ్మెల్యేలకు స్థానచలనం అధికార పార్టీకి వ్యతిరేకం కాగా, కూటమి అభ్యర్థులపై సానుభూతి, అభివృద్ధి ఆకాంక్ష ప్రజలను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా మెజార్టీ ప్రజల అవసరాలు తీర్చేలా, ఆకాంక్షలు నెరవేర్చేలా రూపొందించిన మ్యానిఫెస్టో మరో కారణంగా చెప్పుకోవచ్చు. ఇక పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణానికి స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇవ్వగా, ప్రతిపక్ష ఓటు చీలకూడదన్న ఉద్దేశంతో మూడు పార్టీల శ్రేణులు ఉమ్మడిగా సాగుతున్న తీరు కూటమి విజయాన్ని అడ్డుకోలేరని స్పష్టమవుతోంది.
టీడీపీ 'మహాశక్తి'- ఉచిత బస్సు ప్రయాణం హామీపై ఆడపడుచు ఆసక్తి - Free bus For Women
అధికార పార్టీ నేతల ఆగడాలతో విసిగిపోయిన ప్రజలు
ఐదేళ్ల జగన్ పాలనలో అధికార పార్టీ నేతల అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. పల్లెల్లో ఫ్యాక్షన్ వాతావరణం విస్తరించింది. చిన్న చిన్న వివాదాలు చిలికి చిలికి గాలివానగా మారాయి. ఇక ఇసుక దందా, మట్టి తరలించుకుని స్థానికులపై దాడులకు తెగబడ్డారు. బీసీలు, దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆయా సంఘాల నాయకులు వాపోయారు. దళిత ఉద్యోగుల హత్యలు, దాడులు, విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఉదంతాలు ఇప్పటికీ ప్రజల కళ్ల ముందు కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత రావడంతో అధిష్ఠానం మార్పులు, బదిలీలకు శ్రీకారం చుట్టింది.
'చంద్రబాబుతో అమిత్షా ఏమన్నారంటే!'- 'నెటిజన్ల స్పందన ఇదీ' - Hello AP Bye Bye YCP
కూటమి అభ్యర్థులపై సానుభూతి, అభివృద్ధిపై ఆకాంక్ష
కూటమి అభ్యర్థులపై ప్రజల్లో సానుభూతి కనిపిస్తోంది. నిత్యం ప్రజల్లో ఉంటూ స్థానిక సమస్యలపై గొంతెత్తిన టీడీపీ, జనసేన నేతలపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయడం విదితమే. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నాయకులు, ఎమ్మెల్యే అభ్యర్థులపై ప్రజల్లో సానుభూతి కనిపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపిన వైనాన్ని జనం ఇంకా మర్చిపోలేదు. చంద్రబాబు హయాంలో ప్రవేశ పెట్టిన పథకాలు, అన్నా క్యాంటీన్లను ప్రజలు నేటికీ గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే రాజధాని పూర్తవుతుందని, పోలవరం ప్రాజెక్టు పనులు ఊపందుకుంటాయని జనం విశ్వసిస్తున్నారు.
జగన్ భూ దాహానికి ముసుగు చట్టం - ఆ లక్షల ఎకరాలు ఎవరి ఖాతాలోకి? - AP LAND TITLING ACT 2023