BJP MP Laxman fires On BRS And Congress Parties : కేసీఆర్ ఎలాంటి యాత్రలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన తెలంగాణలో 10 నుంచి 12 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోబీజేపీ అభ్యర్థులకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని, దాన్ని జీర్ణించుకోలేక దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
"వికసిత్ భారత్ తరహాలో వికసిత్ తెలంగాణ పత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తాం. మా ప్రణాళికను స్పష్టంగా ప్రజల ముందు ఉంచుతాం. దేశ వ్యాప్తంగా 102 స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. 21 రాష్ట్రాల్లో ఓటింగ్ సరళి చూస్తుంటే మోదీ మేనియా స్పష్టంగా కనిపిస్తోంది. మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి ఓట్లు వేశారు. 63 శాతం ఓటింగ్ జరిగింది. శుక్రవారం జరిగిన ఓటింగ్ లో 50 శాతానికి పైగా బీజేపీ విజయం కనిపిస్తోంది తెలంగాణలో 12 సీట్లు గెలుస్తామనే నమ్మకం కలుగుతోంది."- లక్ష్మణ్, బీజేపీ ఎంపీ
అభివృద్ధిని పక్కనపెట్టి విద్వేష రాజకీయాలు చేస్తారా? : మాధవీలత - Madhavi latha on Owaisi
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని కేసీఆర్ అన్నారని కానీ ఆయన అన్న 24 గంటల్లోనే ప్రకాష్ గౌడ్ వెళ్లి రేవంత్‌రెడ్డిని కలిశారని లక్ష్మణ్ అన్నారు. బీజేపీని రెచ్చగొట్టేలా కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నవంబరులో ఎన్నికలు వస్తాయంటున్న కేసీఆర్ మాటలకు ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అధికారం లేకుండా కేసీఆర్, కేటీఆర్ ఉండలేకపోతున్నారని అన్నారు.