BJP MLAs on Violation of Protocol Issues Telangana : ప్రొటోకాల్ ఉల్లంఘనలపై అసెంబ్లీలో బీజేపీ నేతలు నిరసన తెలిపారు. ఈ అంశంపై శాసనసభలో బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నియోజకవర్గాల్లో తమను పట్టించుకోవడం లేదని కనీస సమాచారం ఇవ్వడం లేదని బీజేపీ సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. తాము గౌరవం ఇస్తున్నప్పుడు, అధికార పార్టీ నేతలు కూడా అలానే ఉండాలన్నారు. సమసమానం అన్న నేతలు నిధులు కేటాయింపులో వివక్షత చూపిస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై సీఎం చేసిన ప్రకటన మీద చర్చ సాగుతుంటే బీజేపీ సభ్యులు ప్రోటోకాల్‌పై మాట్లాడటం సరికాదని అధికార పక్ష సభ్యులు సూచించారు. స్పీకర్‌కు చేయి చూపిస్తూ మాట్లాడటంపై మంత్రి శ్రీధర్‌బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో తాము కూడా ఇలాంటి ఇబ్బందులు పడ్డామని, ఆ ఆవేదన ఏలా ఉంటుందో తెలుసని అన్నారు. అందుకే ప్రత్యేకంగా బీజేపీ నేతలతో స్పీకర్ ఛాంబర్‌లో మాట్లాడుతామన్నారు. సభను అమర్యాదపరిచేలా మాట్లాడవద్దని వారించిన స్పీకర్, సభ తర్వాత బీజేపీ సభ్యులను, మంత్రిని పిలిచి మాట్లాడుతానని చెప్పారు.