BJP Maheshwar Reddy Says Dharani portal Scam :దేశంలోనే అతిపెద్ద కుంభకోణం రాష్ట్రంలో ధరణి పేరుతో జరిగిందని బీజేపీ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ధరణిలో రూ.2 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఈ కుంభకోణంలో కేసీఆర్, కేటీఆర్‌ను రక్షించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అదే విధంగా లక్షల ఎకరాల భూమికుంభకోణానికి ధరణి కేంద్రంగా మారిందన్న ఆయన, ఈ కుంభకోణంలో కేసీఆర్, కేటీఆర్ ఉన్నప్పటికీ సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. భారీ కుంభకోణాన్ని ఎందుకు బయటకు తీసుకురావడం లేదని మండిపడ్డారు.
సమగ్ర సర్వే పేరుతో భూములను డిజిటల్ చేయాలని కేంద్రం నిధులు ఇస్తే, కేసీఆర్ ధరణి పోర్టల్ (Dharani Portal Issues) పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ కంపెనీకి ధరణి పోర్టల్‌ను ప్రభుత్వం అప్పగించిందని దుయ్యబట్టారు. ధరణి మీద సీఎం ఎందుకు విచారణ చేపట్టడం లేదని ప్రశ్నించారు. కోకాపేట భూముల వేలంపైన గతంలో రేవంత్ రెడ్డి ధర్నా చేశారని, సీఎం అయ్యాక ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు.
Bandi Sanajay comments on CM KCR : 'ధరణి బాధితులతో.. సభ నిర్వహిస్తే పరేడ్‌గ్రౌండ్ నిండిపోతుంది'
"వేలాది ఎకరాల భూదాన్, దేవాలయ భూములు రికార్డుల్లో కనిపించడం లేదు. ధరణి మీద ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణ జరిపించడం లేదు. చెరువు, అసైన్డ్ భూములు, వక్ఫ్ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. కోకాపేట భూముల వేలంపైన గతంలో రేవంత్ రెడ్డి ధర్నా చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డి ఎందుకు ఈ విషయంపై స్పందించడం లేదు. కాంగ్రెస్ పార్టీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోంది." - మహేశ్వర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే