తెలంగాణ

telangana

ETV Bharat / politics

బెంగళూరు రేవ్ ​పార్టీలోనూ వైఎస్సార్సీపీ హస్తం! - నిందితులతో పార్టీ నేతలకు లింకులు - BANGALORE RAVE PARTY UPDATES - BANGALORE RAVE PARTY UPDATES

Bangalore Rave Party Accused Links with YSRCP Leaders : బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో ఏ-2గా ఉన్న అరుణ్‌కుమార్‌ సీఎం జగన్‌, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డితో దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. హైదరాబాద్‌లో ఉంటూ వైఎస్సార్సీపీ కీలక నేతలతో సంబంధాలు ఉండటం వల్లే వారితో ఫొటోలు తీయించుకున్నట్లు తెలుస్తోంది.

Bangalore Rave Party Accused Links with YSRCP Leaders
Bangalore Rave Party Accused Links with YSRCP Leaders (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 25, 2024, 12:36 PM IST

బెంగళూరు రేవ్ ​పార్టీలోనూ వైఎస్సార్సీపీ హస్తం! - నిందితులతో పార్టీ నేతలకు లింకులు (ETV Bharat)

Bangalore Rave Party Accused Links with YSRCP Leaders : కర్ణాటకతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టై, రిమాండ్​లో ఉన్న ఏ-2 అరుణ్‌ కుమార్‌కు వైఎస్సార్సీపీ కీలక నేతలతో సంబంధాలున్నట్లు వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం మడవనేరికి చెందిన నిందితుడు మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తూ అధికార పార్టీ నేతలతో సంబంధాలు నెరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో ఏ-2గా ఉన్న అరుణ్‌ కుమార్‌ సీఎం జగన్‌, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డితో దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. హైదరాబాద్‌లో ఉంటూ వైఎస్సార్సీపీ కీలక నేతలతో సంబంధాలు ఉండటం వల్లే వారితో ఫొటోలు తీయించుకున్నట్లు తెలుస్తోంది. బెంగళూరు రేవ్ పార్టీ వద్ద ఓ వాహనంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరిట ఎమ్మెల్యే అనే స్టిక్కర్ ఉండటం సంచలనం కలిగించింది. ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని మంత్రి చెబుతున్నారు. ఈ కేసులో విజయవాడకు చెందిన బుకీ లంకలపల్లి వాసును పోలీసులు ఏ1గా చేర్చారు.

బెంగళూరు రేవ్‌ పార్టీ అప్​డేట్ - 103 మందిలో తెలుగు నటి సహా 86 మందికి డ్రగ్‌ పాజిటివ్‌ - BANGALORE RAVE PARTY DRUG TESTS

Tollywood Cctress inRave Party : ఏ2 అరుణ్‌ కుమార్ కావడం, ఆయనకు అధికార పార్టీతో లింకులు ఉండటం సంచలనమైంది. విజయవాడ 1 టౌన్‌కు చెందిన డి.నాగబాబును ఏ-3గా ఎఫ్​ఐఆర్​లో చేర్చారు. ఈ ముగ్గురిలో అరుణ్‌ కుమార్‌కే వైఎస్సార్సీపీతో సంబంధాలు ఉన్నట్లు ఆయన సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. రేవ్ పార్టీలో పలు మాదక ద్రవ్యాలు వినియోగించారనే దానిపై విచారణ జరిపిన పోలీసులు, ఆ పార్టీలో పలు ప్రమాదకరమైన మత్తు పదార్థాలు వినియోగించినట్లు గుర్తించారు. ఇదిలా ఉండగా దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. పలువురు టాలీవుడ్ ​యాక్టర్లు ఈ బెంగళూరు రేవ్​ పార్టీలో పాల్గొన్నారనే అంశం సర్వత్రా సంచలనం రేపింది. కాగా డ్రగ్స్​ టెస్ట్​లో 86 మందికి పాజిటివ్​ రావడం మరింత ఉత్కంఠ రేపింది.

హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో వ్యాపారం చేసే అరుణ్‌ కుమార్‌ను వైఎస్సార్సీపీ నేతలు తరచూ కలుస్తుంటారు. ఇప్పటికే ఈ కేసులో లంకలపల్లి వాసుతో పాటు అరుణ్‌ కుమార్‌ను ఈ నెల 21న బెంగళూరు పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి తర్వాత పరప్పణ అగ్రహార కేంద్ర కారాగారానికి తరలించారు.

ఖరీదైన కార్లు, విలాసవంతమైన విల్లాలు - బెంగళూరు రేవ్‌ పార్టీ నిందితుడి చీకటి సామ్రాజ్యం గురించి తెలుసా? - Bangalore Rave Party Accused

రేవ్ పార్టీ అంటే ఏమిటి? - అందులోకి వెళ్లిన వారు ఏం చేస్తారు? - What is Rave Party in Telugu

ABOUT THE AUTHOR

...view details