ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఆత్మీయ సమావేశం- వారి సహకారం కోరిన యువనేత

Arrangements for Krishna Devarayalu to join in TDP: ఇటీవల వైఎస్సార్సీపీ రాజీనామా చేసిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరేందుకు ముహుర్తం ఖరారైంది. దీనిపై నరసరావుపేటలోని వైద్యులు, ఉపాధ్యాయులతో మర్రి పెద్దయ్య వైద్యశాలలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం.

Arrangements_For_Krishna_Devarayalu_to_Join_in_TDP
Arrangements_For_Krishna_Devarayalu_to_Join_in_TDP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 14, 2024, 1:43 PM IST

Arrangements for Krishna Devarayalu to join in TDP: వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 22న ఆయన టీడీపీలో చేరనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో గతరాత్రి నరసరావుపేటలోని వైద్యులు, ఉపాధ్యాయులతో మర్రి పెద్దయ్య వైద్యశాలలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం ఇంఛార్జి చదలవాడ అరవిందబాబు, తెలుగుదేశం డాక్టర్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడియాల వెంకటేశ్వరావు, పలువురు వైద్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నరసరావుపేట నుంచి తెలుగుదేశం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్లు ఈ సందర్భంగా లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పినట్లు సమాచారం. ఇందుకు అందరి సహకారం కావాలని వైద్యులను కోరినట్లు తెలిసింది.

'అధిష్టానం లెక్కలు వేరు - నా ఆలోచనలు వేరు': ఎంపీ ...

కాగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో చేరుతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఒకపార్టీలో నేతలు మరో పార్టీలోకి జారుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వైఎస్సార్సీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి రాజీనామా(MP Lavu Srikrishna Devarayalu Resign to YSRCP) చేస్తున్నట్లు ప్రకటించారు. కొంతకాలంగా పార్టీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

వైఎస్సార్సీపీలో కొంత అనిశ్చితి ఏర్పడిందని, దానికి తాను బాధ్యుడిని కాదని శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలతో కార్యకర్తలు కొంత అయోమయానికి గురవుతున్నారని, దానికి తెరదించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నరసరావుపేట లోక్‌సభ స్థానంలో కొత్త అభ్యర్థిని నిలబెట్టాలని పార్టీ ఆలోచిస్తోందన్న ఆయన.. తనను గుంటూరు నుంచి పోటీ చేయాలని సూచించిందన్నారు. అయితే ఆయనకు గుంటూరు నుంచి పోటీ చేసే ఆలోచనే లేదని స్పష్టం చేశారు.

వైఎస్సార్సీపీలో వన్‌మ్యాన్‌ షో! అంతా అహం బ్రహ్మాస్మి, తెరపై దింపుడు కళ్లం ప్రయత్నాలు

అంతకుముందు కొద్దిరోజుల క్రితం సీఎం జగన్‌(CM Jagan)తో భేటీ అయిన లావు శ్రీకృష్ణదేవరాయలు "అధిష్ఠానం లెక్కలు వేరు.. తన ఆలోచనలు వేరు" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.దీంతో ఇప్పటికే పార్టీ నేతలు ఒక్కొక్కరిగా వైఎస్సార్సీపీ నుంచి బయటకురాగా.. ఆయన కూడా పార్టీని వీడుతారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి శ్రీ కృష్ణదేవరాయలు ఆ ఊహాగానాలకు తెరదించారు.

ఇప్పటికే వైఎస్సార్సీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి(MP Vallabhaneni Balashauri), కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్‌ బయటికొచ్చారు. బాలశౌరి ఇటీవలే జనసేనలో చేరారు. తాజాగా వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమవటం హాట్​ టాపిక్​గా మారింది.

వైసీపీలో మెుదలైన ముస‌లం - ఉదయం ఆళ్ల రామకృష్ణారెడ్డి, మధ్యాహ్నం దేవన్‌రెడ్డి వైసీపీకి రాజీనామా

ABOUT THE AUTHOR

...view details