ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

'రాంగోపాల్​వర్మకు రూ.2లక్షలకు బదులు 2కోట్లు ఇచ్చారు - APSFL అక్రమ చెల్లింపులు' - APSFL CHAIRMAN GV REDDY

ఫైబర్ నెట్ లక్ష్యాన్ని గత ప్రభుత్వం నాశనం చేసింది - వైఎస్సార్సీపీ నేతలు దివాళా తీయించారన్న ఛైర్మన్ జీవీ రెడ్డి

apsfl_RGV_payments
apsfl_RGV_payments (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

APSFL Chairman GV Reddy :పేదలకు మెరుగైన ఇంటర్ నెట్ సౌకర్యాన్ని అందించాలన్న ఫైబర్ నెట్ లక్ష్యాన్ని గత ప్రభుత్వం నాశనం చేసిందని ఏపీ ఎస్ఎఫ్ఎల్ ఛైర్మన్ జీవీ రెడ్డి మండిపడ్డారు. సరైన ప్రణాళిక, నిర్వహణ లేకుండా సంస్థను దివాళా అంచుకు చేర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో రెండేళ్లలో 10లక్షల ఫైబర్ నెట్ కనెక్షన్లు అందిస్తే... ఐదేళ్లలో వాటి సంఖ్యను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 5లక్షలకు దిగజార్చిందని దుయ్యబట్టారు. వ్యూహం సినిమాను ఫైబర్ నెట్ లో టెలికాస్ట్ చేసి అక్రమంగా అధిక మొత్తాన్ని దర్శకుడు రాంగోపాల్ వర్మకు చెల్లించారని వెల్లడించారు.

గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలకు కేబుల్, ఇంటర్నెట్ అందించడమే లక్ష్యంగా 2016లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ (APSFL)ను అప్పటి సీఎం చంద్రబాబు ప్రారంభించారని జీవీ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో 2019లో 24 వేల కి.మీ. కేబుల్ వేసి 10 లక్షల కనెక్షన్లు ఇచ్చామని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో ఏపీఎస్ఎఫ్ఎల్ కనెక్షన్ల సంఖ్య 5 లక్షలకు పడిపోయి, సంస్థ ప్రస్తుతం దివాళా అంచున ఉందని వివరించారు. గత ప్రభుత్వ తీరువల్లే దివాళా తీసే పరిస్థితికి వచ్చిందన్న ఆయన సంస్థలో అవినీతిపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని తెలిపారు.

ఏపీఎస్​ఎఫ్​ఎల్​ ప్రేక్షకులకు శుభవార్త.. 'ఫస్ట్ డే ఫస్ట్ షో' తరహాలో కొత్త సినిమాలు

"2019లో 108 మంది ఉద్యోగులతో నెలకు 40లక్షల ఖర్చుతో నడిపి 10 లక్షల కనెక్షన్లను పెంచాం. కనెక్షన్లు 10 లక్షల నుంచి 5 లక్షలకు పడిపోయినా భారీగా అక్రమంగా ఉద్యోగులను నియమించారు. గతం ప్రభుత్వం 1363 మంది ఉద్యోగులను నియమించి నెలకు 4 కోట్లు వేతనాలు చెల్లించింది. ఉద్యోగుల వేతనాలు పదిరెట్లు పెరిగినా ఆ మేరకు కనెక్షన్లు పెరగాల్సి ఉండగా 5లక్షలు తగ్గాయి. కేబుల్ ఆపరేటర్లను చిత్రహింసలకు, వేధింపులకు గురి చేశారు. ఎపీఎస్ఎఫ్ఎల్ కు 1262 కోట్లు అప్పు చేశారు. టీడీపీ హయాంలో 3513 కోట్లు పెట్టుబడి పెట్టి 10లక్షల కనెక్షన్లు పెంచాం. అంతా రెడీగా ఉన్న సంస్థను వైఎస్సార్సీపీ హయాంలో 6869 కోట్లు ఖర్చుపెట్టి దివాలా తీయించారు. వందల మంది ఉద్యోగులను నియమించగా, వారంతా జీతాలు తీసుకుంటూ వైఎస్సార్సీపీ మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఇళ్లల్లో పనిచేశారు. విజిలెన్స్ విచారణ జరుగుతోంది.. నివేదిక వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తా. వ్యూహం సినిమాను ఫైబర్ నెట్ లో టెలికాస్ట్ చేసి అక్రమంగా అధిక మొత్తాన్ని దర్శకుడు రాంగోపాల్ వర్మకు చెల్లించారు. ఎక్కడా లేని విధంగా 18 లక్షల వ్యూస్ వస్తే 2 లక్షలు చెల్లించాల్సి ఉండగా ఏకంగా 2.10 కోట్లు రాంగోపాల్ వర్మకు అక్రమంగా చెల్లించారు" అని జీవీ రెడ్డి వెల్లడించారు.

గత ఐదేళ్లలో అప్పటి ఎండీ మధుసూదన్ చేసిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ నేతల అక్రమాలు బయటపడకుండా కీలక డాక్యుమెంట్లను విజయసాయిరెడ్డికి ఓ మహిళా ఉద్యోగి చేరవేశారని, ఆమెను గుర్తించి తొలగించామని జీవీ రెడ్డి చెప్పారు. రాబోయే రోజుల్లో ఎపీఎస్ఎఫ్ఎల్ ను సమూలంగా ప్రక్షాళన చేపట్టి కనెక్షన్ల సంఖ్యను 50లక్షల కనెక్షన్లకు పెంచుతామని తెలిపారు. ఎపీఎస్ఎఫ్ఎల్ లో ప్లాన్స్ అన్నింటినీ రివైజ్ చేస్తామని, అవసరం లేని ఉద్యోగులను తొలగిస్తామని అన్నారు. నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా సొంతంగా నిధులు సమీకరించుకుంటామని వెల్లడించారు.

వసూళ్లు ఎన్ని? ఖర్చు ఎంత ? ఏపీఎస్​ఎఫ్​ఎల్​లో మొదలైన ఆడిట్​ - FIBERNET SCAM

ఏపీలో భారత్‌ నెట్ ప్రాజెక్టు విస్తృతికి వేగంగా అడుగులు - కేంద్రమంత్రికి నివేదిక అందజేత - BharatNet Project Expansion in AP

ABOUT THE AUTHOR

...view details