Ministers Visited Weligonda Project:గత ఐదేళ్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం జలయజ్ఞం పేరును ధన యజ్ఞంగా మార్చిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టును మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోల బాల వీరాంజనేయ స్వామి పలువురు ఎమ్మెల్యేలతో కలిసి నిమ్మల సందర్శించారు. దోర్నాల మండలం కొత్తూరు సమీపంలోని 2వ టన్నెల్‌ను మంత్రులు పరిశీలించారు. అక్కడి నుంచి కడపరాజుపల్లి వద్ద ఫీడర్ కాలువను మంత్రి నిమ్మల, కలెక్టర్ తమీమ్ అన్సారియా, టీడీపీ ఇన్‌ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి సందర్శించారు. మంత్రి నిమ్మల స్వయంగా బైక్ నడిపారు. గొట్టిపాటి లక్ష్మితో కలిసి బైక్‌పై కలెక్టర్ తమీమ్ అన్సారియా వెళ్లారు.
నాసిరకంగా ప్రాజెక్టు పనులు: ఈ ప్రాంత ప్రజలను వైఎస్సార్సీపీ నమ్మించి మోసం చేసిందని ఈ సందర్భంగా మంత్రి నిమ్మల విమర్శించారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే ప్రారంభించిన ఘనత జగన్ మోహన్ రెడ్డిదన్నారు. ఈ రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గతంలో వెలిగొండ ప్రాజెక్టు పనులు నాసిరకంగా చేపట్టారని నిమ్మల ఆరోపించారు. ఫీడర్ కెనాల్ 11,500 క్యూసెక్కులు వెళ్లేలా పనులు చేపట్టాల్సి ఉంది కాని ఇప్పుడు కనీసం 10 క్యూసెక్కులు వెళ్లినా బండ్ కొట్టుకుపోయే పరిస్థితి నెలకొందని అన్నారు. ఫీడర్ కెనాల్ గట్టు నాణ్యతపై నివేదిక ఇవ్వాలని మంత్రి నిమ్మల ఆదేశించారు. వెలిగొండ పూర్తయితే 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు.
ఆర్టీసీ డ్రైవర్ డ్యాన్స్ వైరల్ - షాక్ ఇచ్చిన అధికారులు - లోకేశ్ చొరవతో మళ్లీ విధుల్లోకి