ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

'దిల్లీ స్కామ్‌ కంటే పది రెట్లు పెద్దది' - ఏపీ లిక్కర్ స్కామ్​పై లోక్‌సభలో ప్రస్తావన - AP LIQUOR SCAM IN YSRCP REGIME

వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన లిక్కర్‌ స్కామ్‌పై విచారణ జరపాలన్న రమేశ్‌ - విచారణ జరపాలని కేంద్రాన్ని డిమాండ్ చేసిన బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌

cm ramesh in loksabha
cm ramesh in loksabha (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 11, 2025, 3:29 PM IST

AP LIQUOR SCAM IN YSRCP REGIME: దిల్లీ మద్యం కుంభకోణం కంటే ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన లిక్కర్‌ స్కాం పది రెట్లు పెద్దదని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌ జీరో అవర్‌లో లోక్‌సభ దృష్టికి తెచ్చారు. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన లిక్కర్‌ స్కామ్‌పై విచారణ జరపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

2019 - 24 మధ్య ఏపీలో మద్యం విధానం మార్చి కుంభకోణానికి పాల్పడ్డారని విమర్శించారు. మద్యం అంశంపై లోక్‌సభ జీరోఅవర్‌లో ప్రస్తావించిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, వైఎస్సార్సీపీ హయాంలో దిల్లీని మించిన లిక్కర్ స్కామ్‌ జరిగిందని పేర్కొన్నారు. దిల్లీ లిక్కర్ స్కామ్‌తో పోలిస్తే జగన్ స్కామ్‌ పది రెట్లు పెద్దదని అన్నారు.

'దిల్లీ స్కామ్‌ కంటే పదిరెట్లు పెద్దది' - ఏపీ లిక్కర్ స్కామ్​పై లోక్‌సభలో ప్రస్తావన (ETV Bharat)

2019-24 మధ్య ఏపీలో మద్యం విధానం మార్చారన్న సీఎం రమేశ్‌, మద్యాన్ని ప్రైవేట్ షాపుల నుంచి ప్రభుత్వ దుకాణాలకు అప్పగించారని గుర్తు చేశారు. ఐదేళ్లలో రూ.లక్ష కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయన్నారు. ఐదేళ్లపాటు మద్యం లావాదేవీలు నగదుతోనే జరిగాయని తెలిపారు. షాపుల సిబ్బందిని సైతం ఒప్పంద పద్ధతిలోనే నియమించారని పేర్కొన్నారు. రూ.2,500 కోట్ల దిల్లీ లిక్కర్ స్కామ్‌ కంటే ఏపీలో పది రెట్లు పెద్ద స్కామ్ అని ఆరోపించారు.

వైఎస్సార్సీపీ హయాంలో మద్యం అక్రమాలపై సిట్‌ - ప్రభుత్వం ఉత్తర్వులు

ABOUT THE AUTHOR

...view details