ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

గ్రామాల్లోనూ పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం- రైతుల భాగస్వామ్యంతో MSME పార్కులకు కసరత్తు - CM Chandrababu on food processing - CM CHANDRABABU ON FOOD PROCESSING

CM Chandrababu on Food Processing and MSME: ఏపీలో ఆహారశుద్ధి యూనిట్ల ఏర్పాటుకు అపారమైన అవకాశాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాయలసీమ సహా వేర్వేరు ప్రాంతాల్లో దొరికే ఆహార ఉత్పత్తులకు విలువ జోడిస్తే ఎగుమతులకు ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. రైతుల భాగస్వామ్యంతో ఎంఎస్ఎంఈ పార్కులు, పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించాలన్నారు.

Chandrababu
Chandrababu (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 12, 2024, 7:42 PM IST

CM Chandrababu on Food Processing and MSME:ఆంధ్రప్రదేశ్​లో ఆహారశుద్ధి యూనిట్ల ఏర్పాటుకు అపారమైన అవకాశాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సచివాలయంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ, ఆహార శుద్ది పరిశ్రమల శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఉపాధి కల్పనలో కీలకమైన ఎంఎస్ఎంఈల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాటికి చేయూతను ఇస్తుందని సీఎం అన్నారు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందిస్తే ఈ రంగం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చని అన్నారు. సవాళ్లతో దెబ్బతిన్న ఈ రంగాన్ని సరికొత్త విధానాల ద్వారా మళ్లీ గాడిన పెడతామని ముఖ్యమంత్రి తెలిపారు.

గ్రామాల్లోనూ ఎంఎస్‌ఎంఈ తరహా పరిశ్రమలు: రాష్ట్రంలో పెండింగ్​లో ఉన్న ఎంఎస్ఎంఈ పార్కులను త్వరతిగతిన పూర్తి చేసి వసతులు, సౌకర్యాలు కల్పించి పరిశ్రలమ ఏర్పాటును వేగవంతం చేస్తామన్నారు. ఆయా ప్రాంతాల్లో రైతుల భాగస్వామ్యంతో వారే ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసుకునే అంశంపై కసరత్తు చేయాలని సీఎం తెలిపారు. భూములు కలిగిన రైతులు, ప్రైవేటు భాగస్వామ్యంతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం పార్క్​లు ఏర్పాటు చేసుకునే విధానాన్ని అమల్లోకి తేవాలని సూచించారు. రాజధానిలో రైతు భాగస్వామ్యంతో వారికి ఏ విధంగా లబ్ది చేకూర్చామో, అదే తరహా విధానాన్ని ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటులోను అవలంభించాలన్నారు. గ్రామాల్లో ఎంఎస్‌ఎంఈ తరహా పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సాహించాలని, రైతుల భాగస్వామ్యంతో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుపై కసరత్తు చేయాలన్నారు.

వరద సాయాన్ని ప్రకటించిన సీఎం చంద్రబాబు - ఎకరాకు పదివేలు- అదనంగా మరో పదివేలు - Chandrababu on Flood Compensation

పుణే వంటి చోట్ల ఇలాంటి విధానం అమల్లో ఉందని అధికారులు తెలిపారు. అలాంటి విధానాలను పరిశీలించి రాష్ట్రంలో మెరుగ్గా అమలు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. పరిశ్రమల ఏర్పాటులో అర్థంలేని నిబంధనలు తొలగించాలని, సులభంగా అనుమతులు ఇవ్వాలని సీఎం అదేశించారు. నిర్థేశించిన సమయంలో పరిశ్రమల ఏర్పాటుకు ఏ అధికారి అయినా, విభాగం అయినా అనుమతి ఇవ్వకపోతే ఆటోమేటిక్​గా అనుమతులు పొందే విధానాన్ని అమల్లోకి తేవాలన్నారు. ప్యాకింగ్, డిజిటల్ కామర్స్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తే చిన్న పరిశ్రమల ఉత్పత్తులకు డిమాండ్ లభిస్తుందని అన్నారు.

డ్వాక్రా సంఘాల వంటి వాటిని ఎంఎస్ఎంఈలతో అనుసంధానం చేయాలని, వారిని ప్రోత్సహించాలని తెలిపారు. ఎప్పటి నుంచో పెండింగ్​లో ఉన్న పరిశ్రమల ఇన్సెంటివ్స్​ను ఇవ్వాల్సిన అవసరం ఉందని, దానిపై కసరత్తు చేయాలని అధికారులకు సూచించారు. సాంకేతికత ద్వారా ఉత్పత్తి సామర్థ్యం పెంచేలా అధికారులు కార్యాచరణ అమలు చేయాలన్నారు. ఆటోనగర్లను మోడ్రనైజేషన్ చేయాలని, ఎలక్ట్రిక్ వెహికిల్స్​కు సర్వీస్ అందించే విధంగా నైపుణ్యం పెంచాలని సీఎం అన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 7 క్లష్టర్లను పూర్తి చేయాలని సూచించారు. ఎంఎస్ఎంఈకి క్రెడిట్ గ్యారెంటీకి రూ. 100 కోట్లు కేటాయిస్తామని సీఎం తెలిపారు. విశ్వకర్మ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వ్యాపారులకు రుణాలు, ప్రోత్సాహకాలు, ట్రైనింగ్ అందేలా చూడాలని అన్నారు.

ఏఐ సిటీగా అమరావతిని రూపొందించండి- అధికారులకు చంద్రబాబు ఆదేశాలు - Chandrababu Review On Amaravati

రాష్ట్రంలో ఆహార శుద్ధి రంగంపై సీఎం సమీక్ష చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్​కు రాష్ట్రంలో అపార అవకాశాలు, అనువైన పరిస్థితులు ఉన్నాయని ముఖ్యమంత్రి అన్నారు. హార్టికల్చర్, ఆక్వా కల్చర్ ఉత్పత్తులకు, ఆహార శుద్ధి పరిశ్రమ ద్వారా ఆదాయాలు పెరుగుతాయని సీఎం అన్నారు. రైతులు తాము పండించే పంటలకు వాళ్లే వాల్యూ ఎడిషన్ ఇచ్చుకునే పరిస్థితి కల్పించే విధంగా పాలసీ తీసుకురావాలన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటలకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని, వాటిని ప్రోత్సహించాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో పండే టమాటా, మ్యాంగో, మిరప, పసుపు, ఆక్వా ఉత్పత్తులకు అక్కడే ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. పుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ఎంఎస్ఎంఈలతో అనుసంధానం చేసి గ్రామాల్లో ప్రోత్సాహం ఇచ్చే విధంగా విధానాలు తీసుకురావాలని అధికారులకు సీఎం సూచించారు.

దేవాదాయశాఖ అర్చకులకు ఇక నుంచి రూ. 15 వేల వేతనం-సీఎం చంద్రబాబు - CBN Review on Endowments Department

ABOUT THE AUTHOR

...view details