CM Chandrababu Interacts with Media: గత ఐదేళ్లు ప్రజలు పడిన ఇబ్బందులకు విముక్తి కలిగించి 2024 ఏడాది చరిత్ర తిరగరాసిందని సీఎం చంద్రబాబు అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు వచ్చిన సీఎం మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. జగన్ పాలనలో గత ఐదేళ్లు మీడియా కూడా ఇబ్బందులు పడిందని గుర్తు చేశారు.
గత 6 నెలలుగా అందరికీ భవిష్యత్‌పై ఒక భరోసా వచ్చిందని అన్నారు. అధికారులను కూడా గత బురదలో తోసేశారని అన్నారు. కొందరు అధికారులు జగన్ మాటలు విని పని చేశారని విమర్శించారు. అమరావతి నగరం భవిష్యత్తులో అభివృద్ధి చెందే నగరమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సీఎంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు తెలుగుదేశం శ్రేణులు భారీగా తరలివచ్చారు.
నాయకులు చంద్రబాబుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, డీజీపీ ద్వారకా తిరుమలరావు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు సీఎంని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Chandrababu Visit Indrakeeladri: దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ఈ ఏడాది అన్నింటా శుభం జరగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను ఆయన బుధవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో అర్చకులు, సిబ్బంది స్వాగతం పలికారు. దర్శనానంతరం వేదమంత్రాలతో ఆశీర్వచనం చేశారు. తీర్థ ప్రసాదాలను అందించారు.
వీడెవడండీ బాబూ - ఏకంగా విద్యుత్ తీగలపైనే పడుకున్నాడు - వీడియో వైరల్
CM Chandrababu New Year wishes: తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఉన్న భారతీయులందరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది రోజున దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. చిన్న పిల్లల్లోనూ మంచి స్ఫూర్తి కనిపిస్తోందని చెప్పారు. ఈ సంవత్సరం కార్యక్రమాలన్నీ విజయవంతం అవ్వాలని ఆకాంక్షించారు. మరోవైపు న్యూ ఇయర్ సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చి జగన్మాతను దర్శించుకుంటున్నారు. అనంతరం చంద్రబాబు రాజ్‌భవన్‌లో గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ని కలిశారు. ఇరువురూ పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. నూతన ఏడాది ప్రభుత్వ లక్ష్యాలపై గవర్నర్‌తో సీఎం చర్చించారు.
CM Chandrababu meets Governor: రాజ్ భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వంకంగా భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి, గవర్నర్ పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కొత్త ఏడాది ప్రభుత్వ లక్ష్యాలపై సీఎం గవర్నర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో పింఛన్ల పండుగ - ఇంటింటికెళ్లి నగదు అందజేసిన ప్రజాప్రతినిధులు
ప్రయాణికులకు గుడ్‌న్యూస్ - సంక్రాంతికి 6,432 ప్రత్యేక బస్సులు