AP CEO Mukesh Kumar Meena on Election Rules:రాష్ట్ర సచివాలయంలో ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా (AP CEO Mukesh Kumar Meena) డీజీపీ కేవీ రాజేంద్రనాధ్ రెడ్డి, సీఎస్ కెఎస్ జవహర్ రెడ్డి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ఈ సమీక్షలో సైబర్ సెక్యూరిటీ, ఐటీ, స్వీప్, శాంతి భద్రతలు, సెక్యూరిటీ, కమ్యునికేషన్ ప్లాన్, కంప్లైంట్ రిడ్రస్సల్, ఓటరు హెల్ప్ లైన్, పోలింగ్ కేంద్రాల్లో కనీసం సౌకర్యాలు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ మూడు రోజులుగా బహిరంగ ప్రాంతాల్లో పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగులు తొలగించామని తెలిపారు. నిబంధనల ఉల్లంఘించిన వారిపై 3 రోజుల్లో 385 కేసులు నమోదు చేశామని తెలిపారు.
సీ విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులు:మద్యం నిల్వలకు సంబంధించి సీ విజిల్ యాప్ ద్వారా 1307 ఫిర్యాదులు వచ్చాయని సీఈవో అన్నారు. ఈ యాప్ ద్వారా ఫిర్యాదుల నమోదుతో 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటామని ఇప్పటి వరకు 74 శాతం సమస్యలు పరిష్కరించామని అన్నారు. ఈ సీ విజిల్ యాప్ ద్వారా ఎవరైనా ఫొటో, వీడియో తీసి పంపవచ్చని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు అనుమతి లేకుండా ప్రచారాలు, రోడ్‌షోలు చేయడానికి వీల్లేదని ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఎన్నికల కోడ్‌ను తుంగలో తొక్కుతున్న వైసీపీ నాయకులు- అధికారుల వైఫల్యంపై విమర్శల వెల్లువ
ఎన్నికలలో పోటీ చేసే పార్టీలు తమ ప్రచారం కోసం సువిధ యాప్ ద్వారా అనుమతులు తీసుకోవాలని అన్నారు. ఇప్పటి వరకు అనుమతుల కోసం 3 రోజుల్లో 388 దరఖాస్తులు వచ్చాయని వాటిపై నిర్ణీత సమయంలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. వాలంటీర్లు, వీఆర్‌వోలు, ఒప్పంద సిబ్బందిపై ఫిర్యాదులు వచ్చాయని, ఫిర్యాదు వచ్చిన ఒప్పంద సిబ్బందిని తొలగించి, రెగ్యులర్ ఉద్యోగులను సస్పెండ్ చేశామని మీనా అన్నారు. కొన్ని విషయాల్లో క్రిమినల్ కేసులు పెట్టామని తెలిపారు. నిన్నటి వరకు 46 మందిపై చర్యలు తీసుకున్నామని అన్నారు. ఇప్పటి వరకు వాలంటీర్లపై 40 కేసులు ఉన్నాయని తెలిపారు.