ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

'ఆయ్‌అండీ, మావాడే గెలుస్తాడండి ' బెట్‌ ఎంతండీ? ఇదీ గోదావరి జిల్లాల పందెం రాయుళ్ల తీరు! - Analysis On AP Elections 2024 - ANALYSIS ON AP ELECTIONS 2024

సాధారణంగా ఆంధ్రావాసులు కొత్త వారితో మనస్సు విప్పి మాట్లాడటం అరుదు, అందులోనూ గోదారోళ్ల వెటకారానికి అంతే ఉండదు. అలాంటిది ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులు, రాజకీయ వాతావరణంపై తమ అభిప్రాయాలు చెప్పేందుకూ సంకోచించడం లేదు. కాలువ గట్లపైన, వేసవి కాలం కావటంతో చెట్ల కింద ఏ నలుగురు గుమ్మికూడినా ఒకటే చర్చ. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు. ఎవరెంత పందెం కాస్తున్నారో అన్నదే అక్కడి చర్చల సారాంశం.

గోదావరి జిల్లాల పందెం రాయుళ్ల తీరు
గోదావరి జిల్లాల పందెం రాయుళ్ల తీరు (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 18, 2024, 11:22 AM IST

Heavy bettings on AP Election: దేశంలో ఓ పక్క ఐపీఎల్‌ బెట్టింగులు జరుగుతుంటే.. మరోపక్క ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు గెలుస్తారనే అంశాలపై పందేలు కాస్తున్నారు. ఎన్నికల ఫలితాలకు మరో 17 రోజుల గడువు ఉండటంపై ఎవరికి వారే అంచనాలు వేసుకుని పందేల్లో మునిగితేలుతున్నారు. ఉభయగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్‌ సరళిని అంచనావేస్తూ పందేలు రూ.లక్షల్లో కాస్తున్నారు.

లక్షకు 5లక్షలు-ఆంధ్రప్రదేశ్‌లో గెలుపుపై జోరుగా బెట్టింగ్స్

Analysis On AP Elections 2024: అమలాపురంలో అసెంబ్లీ నుంచి కూటమి అభ్యర్థి గెలుపు ఖాయమని ప్రత్యర్థి పక్షాలే చెబుతున్నాయంట. గతంలో జరిగిన పరిణామాలు ప్రభావం చూపుతాయట కదా, అందుకే అధికార పార్టీవారు పందేలకు వెనకడుగు వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అమలాపురం పార్లమెంట్‌ కూటమి అభ్యర్థికి లక్ష పైచిలుకు ఓట్ల మెజార్టీ వస్తుందంటున్నారు. పోటీ అభ్యర్థి ప్రచార జాడ పల్లెల్లో లేకపోవటంతో అధికార పార్టీ ఓట్లూ కూటమికే పడ్డాయంటున్నారు. రైలు కూత వినేందుకైనా ఈసారి కూటమికే ఓటేశామని అధికార పార్టీ కార్యకర్తలే చెబున్నారట కదా.. ఇదీ కోనసీమ, ఉభయ గోదావరిలో నడుస్తున్న చర్చ.

ఏపీలో గెలిచేదెవరో తెలుసా?- భారీ పోలింగ్​ వెనుక కారణాలేంటి?

కొత్తపేటలో ఎన్నికల ముందు వరకు ఉప్పునిప్పులా ఉన్న అన్నదమ్ములిద్దరూ కలిసిపోయారని గెలుపు ఈ సారి వారిదేనని చెబుతున్నారు. ముమ్మిడివరంలో ప్రధాన పార్టీ అభ్యర్థికి 10 వేలకుపైగానే మెజార్టీ వస్తోందంటున్నారు. పి.గన్నవరంలో మెజార్టీపైనే పందేలు వేసుకునే పరిస్థితి ఉందంటున్నారు. రాజోలులో ఓ పార్టీ అభ్యర్థి గెలుపు గురించి, సీనియర్‌ అయిన మరో అభ్యర్థి ప్రభావంపై చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో జనసేన ఇక్కడే గెలవడంతో ఈ సారి పరిస్థితిపై లెక్కలు వేసుకుంటున్నారు. రామచంద్రపురంలో కాసింత గట్టిపోటీ ఉందనే అంటున్నారు. మండపేట కూటమిదేనని ఇటీవల కొన్ని పరిణామాలు ప్రత్యర్థిని వెనక్కి నెట్టేశాయని పేర్కొంటున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ యుగియడంతో అభ్యర్థుల గెలుపు, ఓటములపై జోరుగా పందేలు సాగుతున్నాయి.

గెలుపుపై జనసేన ధీమా - పవన్ మెజారిటీపై భారీ అంచనాలు

ఇక్కడ ఆధిక్యంపైనే: కోనసీమ జిల్లాలో అమలాపురం, ముమ్మిడివరం, కొత్తపేటలో ఎక్కువగా పందేలు జరుగుతున్నాయి. అమలాపురంలో కూటమి అభ్యర్థికి 10 వేల నుంచి 15 వేల వరకు మెజార్టీ వస్తుందని పందేలు సాగుతున్నాయి. ముమ్మిడివరంలో గెలుపు ఓటములపైకాకుండా అభ్యర్థుల మెజార్టీపై మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఇక కొత్తపేటలో కూటమి అభ్యర్థి ఆధిక్యంపైనా పందేలు జరుగుతుండటం.. ప్రత్యర్థి గెలుస్తారంటూ ఆ వర్గం కూడా పందేలకు దిగుతోంది. ఉండి, భీమవరం, నర్సాపురం , పిఠాపురం వంటి సీట్లపై స్థానికంగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ బెట్టింగ్‌ చేస్తున్నారు.

రాష్ట్రంలో 81.76 శాతం పోలింగ్​ నమోదు - గతంలో కంటే పెరిగిన ఓటింగ్

సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే ఓటింగ్‌ శాతం పెరిగిందనే ప్రచారం జరుగుతోంది. ఎంపీ, అసెంబ్లీ స్థానాల్లో పెరిగిన ఓటింగ్‌ శాతమే ఇప్పుడు కూటమికి అనుకూలంగా మారిందని అంచనా వేస్తున్నారు. జనసేన అభ్యర్థులు బరిలో ఉన్న పి.గన్నవరం, రాజోలు స్థానాల్లో మెజార్టీపై యువకులు అత్యధికంగా బెట్టింగ్‌ వేస్తున్నారు. మండపేట, రామచంద్రపురం స్థానాల్లోనూ గెలుపు ఓటములతోపాటు మెజార్టీపైనే చర్చ సాగుతోంది.

ABOUT THE AUTHOR

...view details