1320 Tonnes of PDS Rice Identified in Stella Ship : కాకినాడ తీరంలో 55 రోజులపాటు నిలిచిపోయిన స్టెల్లా నౌక ఎట్టకేలకు తన గమ్యస్థానానికి బయలుదేరింది. స్టెల్లా నౌక బయలు దేరడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఆదివారం అర్థరాత్రి అధికారులు పచ్చజెండా ఊపారు. నవంబర్ 11న హల్దీయా నుంచి కాకినాడ తీరానికి వచ్చిన నౌకలో రేషన్ బియ్యం ఉన్నట్లు అధికారులు గుర్తించడం, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ నౌకను సీజ్ చేయలని ఆదేశించడంతో అప్పటి నుంచి ఇక్కడే నిలిచిపోయింది.
1320 టన్నుల రేషన్ బియ్యం సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్‌కు చెందినవిగా గుర్తించి పౌరసరఫరాల శాఖ అధికారులు కేసు పెట్టారు. రేషన్ బియ్యాన్ని యాంకరేజ్ పోర్ట్‌కు చేర్చి గోదాముల్లో భద్రపరిచారు. సాధారణ బియ్యం రకాలు నింపి పశ్చిమాఫ్రికా తీరంలోని బెనిన్ దేశ వాణిజ్య కేంద్రం కొటోనౌ నౌకాశ్రయానికి స్టెల్లా నౌకను పంపించారు.
'స్టెల్లా'కు లైన్ క్లియర్ - రేషన్ బియ్యం అన్‌లోడ్ కంప్లీట్
త్వరలోనే 'స్టెల్లా'కి మోక్షం - రేషన్ బియ్యం దించివేత ప్రారంభం